పరుమాల గ్రామంలో గుప్త నిధుల కలకలం
జోగులాంబ గద్వాల 22 ఏప్రిల్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి.మండలం, పరుమాల గ్రామంలో గుప్త నిధులు తవ్వకాలు కలకలం రేపాయి. పరమాల గ్రామ శివారులో ఉన్న శ్రీ రంగస్వామి ఆలయ అవరణలో ఉన్న శివలింగం, వినాయక విగ్రహాల కింద గుర్తు తెలియని వ్యక్తులు తవ్వకాలు జరిపినట్లు బుధవారం గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఈ ఆలయంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపినట్లు గ్రామస్తులు ఆరోపించారు. సుమారు నాలుగు అడుగుల లోతు గుంతను తవ్వారు. అధికారులు, పోలీసులు విచారణ చేపట్టి తవ్వకాలకు పాల్పడిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.