ఘనంగా వాసవిమాత జయంతి వేడుకలు

Apr 26, 2026 - 15:47
Apr 26, 2026 - 15:48
 0  1
ఘనంగా వాసవిమాత జయంతి వేడుకలు
ఘనంగా వాసవిమాత జయంతి వేడుకలు

ఆర్యవైశ్యులకు రాజకీయంగా  రెండు దఫాలు మున్సిపల్ చైర్మన్లుగా అవకాశాలు కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీదే

ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి

టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి 

రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పోతు భాస్కర్ 

మున్సిపల్ చైర్మన్ మొరిశెట్టి నివేదిత లక్షాది

సూర్యాపేట 26ఏప్రిల్ 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం వాసవి మాత జయంతి సందర్భంగా ఆదివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పోతు భాస్కర్, మున్సిపల్ చైర్మన్ మొరిశెట్టి నివేదిత లక్షాది,

వాసవి మాత అమ్మవారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సర్వోత్తమ్ రెడ్డి  ఆర్యవైశ్య సోదర, సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. ధర్మం, అహింస, సమానత్వం వంటి మహోన్నత విలువలను ప్రపంచానికి తెలియజేసిన వాసవీ మాత ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు.

వాసవీ మాత చూపించిన సత్య మార్గంలో నడుస్తూ సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం పెంపొందించాలని పిలుపునిచ్చారు. ప్రతి ఏటా వైశాఖ శుక్ల పక్ష దశమి రోజున శ్రీ వాసవీ మాత ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించిన విషయాన్ని గుర్తుచేశారు. భక్తి శ్రద్ధలతో శ్రీ వాసవీ మాత ఉత్సవాలను నిర్వహిస్తూ, ధర్మం, నీతి, సేవాభావం వంటి మహత్తర విలువలను మన జీవితాల్లో ఆచరిస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఆర్యవైశ్య సంఘ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333