గద్వాల బార్ అసోసియేషన్ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్న ఐజ అఖిలపక్ష కమిటీ

Jan 1, 2025 - 20:42
 0  5
గద్వాల బార్ అసోసియేషన్ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్న ఐజ అఖిలపక్ష కమిటీ

జోగులాంబ గద్వాల జిల్లా, ఐజ మున్సిపాలిటీ కేంద్రంలో నూతన సంవత్సరాన్ని గత కొద్ది రోజులుగా ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని పీజేపీ క్యాంపు కార్యాలయంలోనే కోర్టు భవనాన్ని నిర్మించాలని గద్వాల బార్ అసోసియేషన్ వారు గద్వాల కోర్టు ముందు దీక్ష చేస్తున్న వారికి మద్దతుగా ఐజ అఖిలపక్ష కమిటీ వారికి పూర్తి మద్దతునిస్తూ దీక్షలో కూర్చోవడం జరిగింది. దానితోపాటు జిల్లాలో ఉన్నటువంటి అన్ని పార్టీలు, ప్రజాసంఘాలను, ప్రజలను, సంఘటితం చేసి దీక్షా శిబిరాన్ని విజయవంతం చేశారు. ఇట్టి విషయాన్ని నాగర్ కర్నూల్ పార్లమెంటు సభ్యులు డాక్టర్  మల్లు రవి గారు, అలంపూర్ మాజీ శాసనసభ్యులు ఏఐసీసీ సెక్రటరీ SA సంపత్ కుమార్ గారు గద్వాల బార్ అసోసియేషన్ వారు చేస్తున్న దీక్ష శిబిరానికి మద్దతునిస్తూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి బార్ అసోసియేషన్ వారు చేస్తున్నటువంటి దీక్ష న్యాయమైనదని వారు కోరుకున్న విధంగానే పిజెపి క్యాంపు లోనే భవన సముదాయాన్ని నిర్మించాలని వినతి పత్రము సమర్పించి గద్వాల బార్ అసోసియేషన్ వారిని దీక్ష విరమింప చేశారు. ఇట్టి విషయాన్ని ఐజ అఖిలపక్ష కమిటీ  నాయకులు ప్రజల పక్షాన ఉండి ప్రజల అవసరాలకు, ఉద్యమాలకు పరోక్షంగా, ప్రత్యక్షంగా సహకారం అందించిన ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ గద్వాల కోర్టు భవనాన్ని పిజెపి క్యాంపులోనే నిర్మించాలని వారికి మద్దతు ఇచ్చిన కేంద్రమంత్రి బండి సంజయ్ గారికి డాక్టర్ మల్లు రవి గారికి సంపత్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లాయర్లు, ఐజ అఖిలపక్ష కమిటీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333