బిఆర్ఎస్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ప్రారంభించిన మండల అధ్యక్షుడు కొమ్మిడి ప్రభాకర్ రెడ్డి
అడ్డగూడూరు 25 ఏప్రిల్ 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని చౌల్లరామారం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని శనివారం రోజు మండల అధ్యక్షుడు కొమ్మిడి ప్రభాకర్ రెడ్డి,గ్రామ సర్పంచ్ మందుల రేణుక కిరణ్, ప్రారంభించారు.వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రజలకు చల్లని తాగునీరు అందించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రం గ్రామ ప్రజలకు,ప్రయాణికులకు దాహం తీరానుంది.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దర్శనాల అంజయ్య,ఉపసర్పంచ్ తోట కృష్ణారెడ్డి,మాజీ సింగిల్ విండో డైరెక్టర్ పోగుల నర్సిరెడ్డి, నాయకులు మెట్టు భాస్కర్ రెడ్డి, దర్శనాల మహేందర్,కమ్మంపార్టీ నరేష్,తోట భాస్కర్ రెడ్డి పార్టీ నాయకులు,కార్యకర్తలు,గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.