ఖమ్మం జర్నలిస్టుల ఐక్యత కు నూతన కార్యాలయం""మే 3 ఉదయం 10 గంటలకు ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవం

Apr 24, 2026 - 18:17
Apr 24, 2026 - 19:31
 0  2
ఖమ్మం జర్నలిస్టుల ఐక్యత కు నూతన కార్యాలయం""మే 3 ఉదయం 10 గంటలకు ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవం

ఖమ్మం జర్నలిస్టుల ఐక్యతకు కొత్త దిశ

మే 3 ఉదయం 10 గంటలకు నూతన కార్యాలయ ప్రారంభోత్సవం – ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం, సభ్యత్వాలకు ఘన ఆహ్వానం

తెలంగాణ వార్త ప్రతినిధి రావెళ్ళ::ఖమ్మం, ఏప్రిల్ 24: ఖమ్మం జిల్లా జర్నలిస్టుల సంఘటిత శక్తికి నూతన ఊపిరి పోసే విధంగా ప్రెస్ క్లబ్‌లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం, ప్రెస్ క్లబ్ అభివృద్ధిని ప్రధాన ధ్యేయంగా తీసుకుని నూతన కార్యవర్గాన్ని జిల్లా అధ్యక్షుడు ఐ. ప్రభాకర్ ప్రకటించారు.

జిల్లా ఉపాధ్యక్షులుగా ఏ. నరేంద్ర కుమార్, డి. నరేష్ రాజు నియమితులయ్యారు. ప్రధాన కార్యదర్శిగా ఎండీ ఫసుద్దీన్, కార్యదర్శిగా వెంకట్రాజు కేశిరాజు బాధ్యతలు చేపట్టారు. జాయింట్ సెక్రటరీగా మాచర్ల సాల్మన్ శ్రీనివాసరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీగా పి. వెంకటేశ్వర్లు, కోశాధికారిగా పి. ప్రణీత్ కుమార్ ఎంపికయ్యారు. ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా రావెళ్ళ రవి కుమార్, ఖమ్మం డివిజన్ సెక్రటరీగా డి. అవినాష్ బాధ్యతలు స్వీకరించారు. మొత్తం 9 మంది సభ్యులతో సమర్థవంతమైన టీమ్‌ను రూపొందించారు.

ఈ సందర్భంగా జర్నలిస్టులకు ఒక పిలుపునిచ్చారు—ప్రెస్ క్లబ్ బలోపేతానికి ముందుకు రావాలని, అర్హత కలిగిన ప్రతి జర్నలిస్టు సభ్యత్వం పొందాలని సూచించారు. ఐక్యతే శక్తి అనే నినాదంతో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టనున్నట్లు వెల్లడించారు.

అదేవిధంగా, మే 3వ తేదీ ఉదయం 10 గంటలకు ఖమ్మం జిల్లా ప్రెస్ క్లబ్, తెలంగాణ జర్నలిస్ట్ మీడియా యూనియన్ నూతన కార్యాలయ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించనున్నట్లు ప్రకటించారు.

జర్నలిస్టుల సమస్యలకు బలమైన వేదికగా, హక్కుల కోసం పోరాడే కేంద్రంగా, వృత్తి గౌరవాన్ని కాపాడే శక్తిగా ప్రెస్ క్లబ్‌ను తీర్చిదిద్దడమే ఈ కొత్త కార్యవర్గ లక్ష్యమని నిర్వాహకులు స్పష్టం చేశారు.

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State