ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు

Feb 17, 2025 - 20:50
 0  15
ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు దండు మైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు.. ఆత్మకుర్ ఎస్.. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి టిఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదిన వేడుకలను సోమవారం ఆత్మకూరు మండల పరిధిలోని  దండు మైసమ్మ ఆలయం వద్ద ఏపూర్ రామాలయం దగ్గర ఘనంగా నిర్వహించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ ఆవరణలో కేకులు కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకట నారాయణ గౌడ్ మండల పార్టీ అధ్యక్షులు తుడి నరసింహారావు , ముద్దo కృష్ణారెడ్డి,బెల్లంకొండ యాదగిరి, నంద్యాల మధుసూదన్ రెడ్డి, బ్రహ్మం, సనబోయిన సుధాకర్,బషీర్, కానాల మల్లారెడ్డి, వెంకన్న, ఎడవెల్లి ముత్తయ్య, కన్నయ్య, వెంకటరెడ్డి, గురువయ్య, నాగరాజు, మల్లయ్య, శ్రీను తదితరులు పాల్గొన్నారు.