చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు సియన్ రంగరాజన్ పై దాడిని తీవ్రంగా ఖండించిన పాస్టర్స్
రాజ్యాంగ ప్రాథమిక హక్కు అయినా మత స్వాతంత్రపు హక్కు , భావ స్వేచ్చను హరించే ఏవ్యక్తులైన, ఏ మతం వారైనా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి
సూర్యాపేట జిల్లా పాస్టర్స్ పెలోషిప్ వర్కింగ్ ప్రెసిడెంట్
బిషప్ దుర్గం ప్రభాకర్
సూర్యాపేట నియోజకవర్గ పాస్టర్స్ పెలోషిఫ్ అధ్యక్షులు
రెవ. డా. జలగం జేమ్స్
మంగళవారం ఫిబ్రవరి 11 : ఆత్మకూర్ (యస్ ) మండల కేంద్రం నందు పాస్టర్ రెవ తాడంకి కిరణ్ బాబు ఇమ్మానియెల్ ప్రార్ధన మందిరంలో జరిగిన సమావేశంలో సూర్యాపేట జిల్లా పాస్టర్స్ పెలోషిప్ వర్కింగ్ ప్రెసిడెంట్ బిషప్ దుర్గం ప్రభాకర్,సూర్యాపేట నియోజకవర్గ పాస్టర్స్ పెలోషిఫ్ అధ్యక్షులు రెవ. డా. జలగం జేమ్స్ లు మాట్లాడుతూ ఇటీవల కాలంలో రంగారెడ్డి జిల్లా చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు సిఎస్ రంగరాజన్ పై కొందరు మతం ముసుగులో దుండగులు దాడి చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. బిషప్ దుర్గం ప్రభాకర్ మాట్లాడుతూ మత గురువులు ఆధ్యాత్మిక బోధనలు అందించేవారని, దేశ క్షేమం, ప్రజల క్షేమం కోరుకొనే పూజరి అనీ,మతాలు అనేవి ఆయా వ్యక్తుల వ్యక్తిగత విషయం అయినప్పటికీ సమాజంలో కొందరు మతోన్మాద ముసుగులో ఇతరులపై దాడి చేయడం అనేది సహించారాని నేరం అనీ.రామరాజ్యం అనే ర్యాడికల్ సంస్థకు అర్చకులు రంగరాజన్ వారి దుర్మార్గతకు మద్దతు ఇవ్వడం లేదనే ఆక్రోషంతో దాడి చేయడం సరికాదన్నారు.వీరు యువతను తప్పుడు మార్గంలో నడిపిస్తూ సమాజాన్ని తప్పుద్రోవ పట్టిస్తూ దేశాన్ని బ్రష్టు పట్టిస్తున్నారనీ ఆవేదన వ్యక్తం చేశారు.ఇలాంటి దాడులు హిందూ,ముస్లిం,క్రైస్తవ మతాలతో పాటు ఇతర మతాలకు చెందిన మత బోధకులపై,వ్యక్తులపై కొన్ని ఆంక్షల పేరుతో దాడులు చేస్తే తాము ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. సమాజంలో నివసించే వ్యక్తులుగా భారత పౌరులుగా తాము ఈ దాడిని తీవ్రంగా ఖoడిస్తున్నట్లు తెలుపుతూ అన్నీ మతాలవారు ముక్తా కంఠంతో దీనిని ఖండించాలని అన్నారు.రంగరాజన్ పై సుమారు 20 మంది దాడి చేసినట్లు ఇప్పటికే పోలీసులు గుర్తించారని,వారిని త్వరగా పట్టుకొని చట్ట పరంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ.మత సామరస్యాన్ని కాపాడటంలో తెలంగాణ రాష్ట్రం ముందు ఉందని,దాన్ని బ్రష్టు పట్టించే ఎంతటి వారి పైనైనా ఉపేక్షించేది లేకుండా ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని కోరారు.ఈ సమావేశంలో ఫాస్టర్స్ పెలోషిప్ గౌరవ సలహాదారులు బొక్క ఏలియా రాజు,పెన్ పహాడ్ మండల అధ్యక్షులు రెవ జాన్ ప్రకాష్,రెవ.పి. వి.బోయాజ్,రెవ.బానోత్ సుధాకర్,పాస్టర్ బొప్పాని అన్వేష్,పాస్టర్ పుల్లూరు మహేందర్,పాస్టర్ మల్లేపల్లి ప్రకాష్ పాల్ తదితరులు పాల్గొన్నారు.