అగ్ని పధ్ పధకాన్ని రద్దుచేసి ఆర్మి రిక్రూట్మెంట్ జరపాలి...
బిజెపి కి దేశ రక్షణ పట్ల చిత్తశుద్ది లేదు...
రక్షణ శాఖలో ఖాళీగా ఉన్న 1,04,653 పొస్టులను భర్తి చేయాలి...
ఏఐవైఫ్ ఆధ్వర్యంలో పొదిలిలో నిరసన...
ప్రకాశంజిల్లా పొదిలిలో అఖిలభారత యువజన సమాఖ్య ఆధ్వర్యంలో అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలని విద్యార్ది సంఘం నిరసన వ్యక్తం చేసింది.
అగ్నిపథ్ పధకం తో కేవలం నాలుగు సంవత్సరాలు మాత్రమే ఉపయెగించుకొని తర్వత ఇంటికి పంపి వారికి పెన్షన్ ఇతర సదుపాయాలు లేకుండా చేస్తుందని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు ఆర్.కరుణానిధి అన్నారు.
ఈ పధకం ద్వారా 100 మందిని రిక్రూట్మెంట్ చేసుకుంటే అందులో కేవలం 25 మందిని మాత్రమే శాశ్వత ఉద్యొగులుగా తీసుకుంటారని మిగత 75 మందిని నాలుగు సంవత్సరాల తరువాత 11లక్షలు తీసుకొని బయటికి పొవాల్సిన పరిస్థితి ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో కెఐవైఎఫ్ నాయకులు పుట్ట సుబ్బారావు,ఏఐఎస్ఎఫ్ నాయకులు పవన్ కళ్యాణ్,స్టాలిన్,అశోక్ తదితరులు పాల్గొన్నారు.