ప్రజల సమస్యల పరిష్కారానికి జిల్లా ఎస్పీ ప్రత్యేక చొరవ – ప్రతిరోజూ మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం  5 వరకు ప్రజావాణి

Jun 5, 2026 - 19:32
 0  0
 ప్రజల సమస్యల పరిష్కారానికి జిల్లా ఎస్పీ ప్రత్యేక చొరవ – ప్రతిరోజూ మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం  5 వరకు ప్రజావాణి

జోగులాంబ గద్వాల 5 జూన్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి : జిల్లా ప్రజలకు పోలీసు సేవలను మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర డీజీపీ సి.వి. ఆనంద్, ఐపీఎస్.,  ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు, ఐపీఎస్., కీలక నిర్ణయం తీసుకున్నారు.

జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రతి రోజు ( వర్కింగ్ డేస్ లో )  మధ్యాహ్నం 3.00 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు జిల్లా ఎస్పీ స్వయంగా ప్రజలకు అందుబాటులో ఉంటారని తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలు తమ వ్యక్తిగత, సామాజిక, న్యాయపరమైన సమస్యలు, ఫిర్యాదులు, వినతిపత్రాలను నేరుగా ఎస్పీ దృష్టికి తీసుకురావచ్చని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను వేగవంతంగా పరిష్కరించడంతో పాటు పోలీసు శాఖపై ప్రజల్లో మరింత విశ్వాసం పెంపొందించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని అధికారులు భావిస్తున్నారు.

 జిల్లా నలుమూలల నుంచి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ సమస్యలను నేరుగా వివరించే అవకాశం కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ సమస్యల పరిష్కారానికి జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని సంప్రదించాలని ఎస్పీ సూచించారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333