వాళ్ల డబ్బులు వాళ్లకు ఇవ్వడానికి ఎందుకింత నిర్లక్ష్యం

Apr 10, 2026 - 13:43
 0  0
వాళ్ల డబ్బులు వాళ్లకు ఇవ్వడానికి ఎందుకింత నిర్లక్ష్యం

జూన్ 10వ తేదీ లోపు బెనిఫిట్స్ రాలేదని ఒక్క రిటైర్డ్ ఉద్యోగి కూడా చెప్పకూడదు రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ విషయంలో ఆర్థిక శాఖపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం

కాంగ్రెస్ ప్రభుత్వం తమ బెనిఫిట్స్ ఇవ్వడంలేదని, రిటైర్డ్ ఉద్యోగులు వేసిన 754 పిటిషన్ల పట్ల విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు

ఒక్కో పిటీషన్లో దాదాపు ఒకటి నుండి 10 మంది పిటిషనర్లు ఉన్నారని, ఒక్కో పిటీషన్లో ఎంత మందికి బెనిఫిట్స్ ఇచ్చారో పూర్తి నివేదిక అందజేయాలని ఆర్థిక శాఖకు ఆదేశాలు

రిటైర్డ్ ఉద్యోగులు చాలా సున్నితంగా ఉంటారని, వారి జీవితాలతో చెలగాటం ఆడొద్దని ఆర్థిక శాఖకు హైకోర్టు హెచ్చరిక

జూన్ 10వ తేదీకి కేసు వాయిదా వేస్తూ, ఆ లోపు పూర్తి నివేదిక ఇవ్వాలని, తదుపరి విచారణలోగా ఒక్క పిటిషనర్ కూడా బెనిఫిట్స్ రాలేదని చెప్పకూడదని ఆదేశించిన తెలంగాణ హైకోర్టు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333