గుట్టుగా గుట్కా దందా
పాన్ షాపుల్లో గుట్టు చప్పుడు కాకుండా విక్రయాలు
అమలుకాని గుట్కా నిషేధం.?
గుట్టుగా సాగుతున్న దందా
విచ్చలవిడిగా అమ్మకాలు పట్టించుకోని అధికారులు
తినుబండారాలు అమ్ముతున్నట్లు.. పల్లెలకు సరఫరా
గతంలో దాడులు చేసి కేసులు పెట్టినా ఆగని దందా
అంబర్ రాజా కైని జరదా పాన్ మసాలాలు అధిక విక్రయం
గుండెపురి ఈటూరు మొండ్రాయి కొండగడప కోటమర్తి చిర్రగూడూరు గ్రామాల్లో అడ్డాగా చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం
జనరల్ కిరాణం మార్వాడి లేడీస్ కార్నర్ పాన్ షాప్ లో అధికం
తిరుమలగిరి 10 సెప్టెంబర్ 2024 తెలంగాణ వార్త రిపోర్టర్
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలోనీ వివిధ జనరల్ కిరాణం మార్వాడి పాన్ షాపుల్లో గుట్కా దందా గుట్టు చప్పుడుకాకుండాసాగుతుంది.అమ్మకాలు యదేచ్చగా సాగుతున్నాయి పల్లె నుండి మున్సిపాలిటీ వరకు ఎక్కడ పడితే అక్కడ జోరుగా వ్యాపారం సాగుతుంది నిషేధిత గుట్కా వ్యాపారం గుటుగా సాగుతుంది. ప్రజలు ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం గుట్కా అమ్మకాలను నిషేధం అమలు చేస్తున్నప్పటికీ కొందరు అక్రమార్కులు మాఫియాను తలపించే విధంగా గుట్కా సామ్రాజ్యాన్ని మున్సిపాలిటీ పరిధిలో నడిపిస్తున్నారు. నిషేధిక గుట్కాను కిరాణంషాపులకుచేరవేస్తున్నారు .గుట్కా ఉత్పత్తులపై నిషేధం ఉన్న కొందరు వ్యాపారులు పోలీసులు కళ్ళు కప్పి విక్రయాలు చేస్తున్నారు. ప్రజల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం గుట్కా పొగాకు ఉత్పత్తులపై నిషేధం విధించింది. గుట్కాలు విక్రయించడం నేరం వీటి వినియోగం ద్వారా గొంతు క్యాన్సర్ బారిన పడడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది .అయితే ఈ నిషేధం ఎక్కడ కనిపించడం లేదు గ్రామాలలో మండలంలో సర్కిల్ పరిధిలో బహిరంగంగా విక్రయాలు కొనసాగుతున్నాయి కానీ ఇవేవీ అధికారాలకు కనిపించకపోవడం విచారకరం ఇప్పటికైనా జిల్లా మండల అధికారులు స్పందించి వ్యాపారంపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తిరుమలగిరి మున్సిపాలిటీ ప్రజలు కోరుతున్నారు
గుట్కా కు బానిసైన యువత..
యువతకు బానిసై అయిపోతున్నారు. ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు నోట్లో గుట్కా, పాన్ మసాలా లేకుండా ఉండలేకపోతున్నారు. ప్రభుత్వం నిషేధం విధించడంతో రూ.10 గుట్కను రూ.20 చొప్పున దుకాణాలు పాను డబ్బాల్లో యథేచ్ఛగా గుట్కా విక్రయిస్తు సొమ్ము చేసుకుంటున్నారు. చాలామంది గుట్కా తినడం తో నోటి క్యాన్సర్ ను బారిన పడుతున్నారు. ప్రభుత్వం బ్యాన్ చేసిన ఇప్పటికే పలుచోట్ల కిరాణా షాప్ లో లభిస్తుంది.
నిఘా పెడితేనే అడ్డుకట్ట...
గుట్కా రవాణాపై నిఘా పెడితేనే అడ్డుకట్ట వేయచ్చనే సంకేతాలు వినిపిస్తున్నాయి. గుట్కా రవాణా చేస్తే ముఠా కాలేజీ బ్యాగుల్లో సరుకును షాపులకు సరఫరా చేస్తున్నట్లు సమాచారం. అక్కడి నుంచి , ద్విచక్ర వాహనాలపై, తీసుకొచ్చి ఎవరికి అనుమానం రాకుండా పెద్ద పెద్ద కిరాణా దుకాణంలో విక్రయిస్తారు. అక్కడి నుంచి వివిధ గ్రామాలకు గుట్టు చప్పుడు కాకుండా రవాణా చేస్తున్నారు. కొంతమంది ముఠాగా ఏర్పడిన ఆ దందాలో రూ. లక్షలలో చేతులు మారుతున్నట్లు వినికిడి. . ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి గుట్కా అమ్మకాలపై నిఘా పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.