గాలికుంటూ వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం.

Oct 16, 2024 - 18:59
 0  7
గాలికుంటూ వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం.
గాలికుంటూ వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం.

జోగులాంబ గద్వాల 16 అక్టోబర్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- ఎర్రవల్లి. ఈరోజు పుటాన్ దొడ్డి,  ధర్మవరం, షేక్పల్లి,   గ్రామాలలో ఉచిత గాలి  కుంటూ వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం నిర్వహించబడినది పుటాన్ దొడ్డి గ్రామంలో జరిగిన కార్యక్రమాన్ని జిల్లా పశువైద్య మరియు పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు  పర్యవేక్షించడం జరిగింది.
 ఈ సందర్భంగా పాడి రైతులతో మాట్లాడుతూ ప్రతి పశువుకు తప్పనిసరిగా మూడు నెలల వయస్సు పైబడిన వాటికి గాలికుంటు వ్యాధి (ఎఫ్ఎండి)
 నిరోధక టీకాలు వేయించి పశువులు వ్యాధి బారిన పడకుండా కాపాడుకోవాలని సూచించారు.
 ఈరోజు 145 తెల్ల పశువులకు 110 గేదెలకు గాలికుంటు టీకాలు వేయడం జరిగింది .
 ఈ కార్యక్రమంలో మండల పశు వైద్యాధికారి డాక్టర్ వై భువనేశ్వరి, వి ఎల్ వో, మసుమీన , పశు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333