ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ఉత్కృష్ట, అతి - ఉత్కృష్ట సేవ పతకాలు:ఎస్పీ టి శ్రీనివాస రావు

Oct 16, 2024 - 19:01
 0  8
ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ఉత్కృష్ట, అతి - ఉత్కృష్ట సేవ పతకాలు:ఎస్పీ టి శ్రీనివాస రావు

జోగులాంబ గద్వాల 16 అక్టోబర్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:-

గద్వాల:*2024 సంవత్సరం నకు  గాను రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖ లోని వివిధ విభాగాలలో పోలీస్ విధులలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ఉత్కృష్ట, అతి - ఉత్కృష్ట సేవ పతకాలకు ఎంపిక చేయడం జరిగింది. జోగుళాoబ గద్వాల్ జిల్లా  నుండి వివిధ హోదాలో ఉన్న ఆధికారులు వారి విధులలో ఉత్తమ ప్రతిభ కనబరిచి ఉత్కృష్ట , అతి- ఉత్కృష్ట సేవ పతకానికి ఎంపిక అయినట్లు జిల్లా ఎస్పీ టి శ్రీనివాస రావు బుధవారం తెలిపారు.
అతి - ఉత్కృష్ట సేవ పతకానికి ఎంపికైన అధికారులు
1.ఏ.అరుణ ఎస్సై -CCS , జోగుళాంబ గద్వాల్ 
2. ఏం. సైలజ, SI -CCS , జోగుళాంబ గద్వాల్ .
3. G. సుంకన్ బాబు,HC-95 , శాంతి నగర్ పోలీస్ స్టేషన్.
4. షేక్ నిజాముద్దీన్, HG-19 , గద్వాల్ టౌన్ పోలీస్ స్టేషన్. 
ఉత్కృష్ఠ సేవ పతకానికి ఎంపికైన పోలీస్ అధికారులు
1. G. రవి బాబు, CI - ఆలంపూర్.
2. టి. వెంకట్ రెడ్డి, ARHC - 2785 పోలీస్ సాయుధ దళ కార్యాలయం.
3.వై. జమ్మన్న,ARHC -2823, పోలీస్ సాయుధ దళ కార్యాలయం.
4. ఏ. రేఖ రెడ్డి,PC -1941 మనో పాడ్ పోలీస్ స్టేషన్.
5. ఖలీల్ ,AR PC -106, పోలీస్ సాయుధ దళ కార్యాలయం .
6. జె. చెన్న కేశవులు, PC -601, శాంతి నగర్ పోలీస్ స్టేషన్ 
7. టి.శ్రీనివాసులు,HG -439, పోలీస్ సాయుధ దళ కార్యాలయం లు ఎంపిక కావడం జరిగింది.
ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ జిల్లా నుండి ఉత్కృష్ట, అతి- ఉత్కృష్ట  సేవ పతకాలకు ఎంపికైన పోలీస్ అధికారులకు అభినందనలు తెలియజేశారు. విది నిర్వహణను బాధ్యతా తో నిర్వహించిన వారికి డిపార్ట్మెంట్ లో తగిన గుర్తింపు తప్పక లభిస్తుందని, జిల్లా పోలీస్ యంత్రాంగం అంత కూడా తమ విధులను భాద్యతగా నిర్వర్తించి మరింతగా ప్రజల మన్ననలు పొందుతారని ఆకాంక్షించారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333