అధిక వర్షాలు పడుతున్న కారణంగా జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
డీఎంహెచ్వో డాక్టర్ శశికళ
జోగులాంబ గద్వాల 16 జూలై 2024 తెలంగాణవార్త ప్రతినిధి. గద్వాల:-జిల్లా ప్రజలు వర్షాలు పడుతున్న కారణంగా అప్రమత్తంగా ఉండాలని పలు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శశికళ తెలుపుతున్నారు.జిల్లా నందు కురుస్తున్న వర్షాలకు ముఖ్యంగా గ్రామాలలో దగ్గు, జలుబు, గొంతు నొప్పి, జ్వరం, కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు, శ్వాసకోశ సమస్యలు, తిన్న ఆహారం జీర్ణంకాక పోవడం వంటివి సీజనల్ వ్యాధులుగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా వర్షాకాలంలో వచ్చే మరి కొన్ని వ్యాధులు ఇన్‌ఫ్లుఎంజా, మలేరియా, డెంగ్యూ జ్వరం, టైఫాయిడ్ జ్వరంతో పాటు హెపటైటిస్ ఏ. ఈ వ్యాధులు ప్రధానంగా వెలుగు చూస్తుంటాయి
ఈ వ్యాధులు బారిన అన్నీ వయసుల వారు పడుతుంటారు. కానీ చిన్న పిల్లలు, వృద్ధుల్లో ఈ వ్యాధుల వలన ఎక్కువ హానీ ఉంటుందని , అందరూ ఇళ్లలో ఆహార పదార్థాలపై మూతలు ఉంచుకోవాలని నీటిని కాచి వడపోసి త్రాగాలని మరి పరిశుభ్రతను పాటించాలని, భోజనానికి ముందు మరియు మరుగుదొడ్డికి వెళ్లి వచ్చిన అనంతరం సబ్బుతో చేతులు కడుకోవాలని తెలుపుతున్నారు.. జిల్లా నందు ఓఆర్ఎస్ డిపోలను ఏర్పాటు చేసి అత్యవసర మందులతో ఇంటింటి ఫీవర్ సర్వే చేస్తున్నారని తెలిపారు మరియు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది ఆశా కార్యకర్తలు , ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉన్న వైద్యాధికారులు సిబ్బందితో అనగా ఏ ఎన్ ఎం లు, హెల్త్ సూపర్వైజర్లతొ ,ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసి, ఎవరికైనా వైద్యము నందు ఇబ్బందులు ఉన్న వారిని తక్షణమే 108 సహాయంతో జిల్లాకు పంపాలని తెలిపారు.