కుటుంబాన్ని సరిదిద్దలేనోడు రాష్ట్రాన్ని ఏం సరిదిద్దుతాడు

Apr 21, 2026 - 19:42
 0  4
కుటుంబాన్ని సరిదిద్దలేనోడు రాష్ట్రాన్ని ఏం సరిదిద్దుతాడు

కెసిఆర్ పై కోమటిరెడ్డి ఫైర్.    

టిఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన కుటుంబాన్నే సరిదిద్దుకోవట్లేదు కానీ రాష్ట్రాన్ని సరిదిద్దుతానని మళ్ళీ తానే ముఖ్యమంత్రి అంటూ జగిత్యాల సభలో ప్రగల్బాలు పలకడం  ఆశ్చర్యంగా ఉందన్నారు. కెసిఆర్ కుమార్తె కవితనే కెసిఆర్ కుటుంబాన్ని ప్రతిరోజు విమర్శిస్తుందని కవిత,హరీష్ రావు, కేటీఆర్, సంతోషం రావు లు తలోబాట  పట్టారని వీళ్ళలో వీరికే సమన్వయ లేదు కానీ మళ్ళీ టీ ఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది అని తెలంగాణ పునర్నిర్మాణం చేపడతామని మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు.కేసీఆర్ ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు పాలించి రాష్ట్రాన్ని దివాళి చేయించారని అప్పులు చేసి కోట్లు మూటగట్టారని తమ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం చేపట్టిందన్నారు 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో ఏ రంగంలో కూడా అభివృద్ధి జరగలేదని ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని సన్న బియ్యం ఇవ్వలేదని అన్నారు. ఎస్ఎల్బీసీ సొరంగం పనులు తిరిగి చేపట్టామని 150 మీటర్ల మేర పనులు జరిగాయని త్వరలో వీటిని పూర్తి చేసి మునుగోడు దేవరకొండ నియోజకవర్గాలకు  సాగునీరు అందిస్తామన్నారు.నల్గొండ నియోజకవర్గంలో గతంలో విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న జగదీశ్ రెడ్డి మూడు సబ్స్టేషన్ కట్టిస్తే తాను 35 సబ్ స్టేషన్లు కట్టించానని, రాష్ట్రంలో 95 ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ పాఠశాలలు మంజూరు చేస్తూ ఇప్పటికే 50 పాఠశాలలు ప్రారంభించామని 45 పాఠశాలలు టెండర్ దశలో ఉన్నాయని ఒక్కో పాఠశాలకు 200 కోట్లతో నిర్మిస్తున్నామన్నారు. నల్లగొండ పాఠశాలను  డిసెంబర్లో ప్రారంభిస్తామని చెప్పారు.తన శాఖ ఆర్ అండ్ బి ద్వారా 19 వేల కోట్ల పనులు నడుస్తున్నాయన్నారు. ప్రెస్ స్టేషన్ తో కెసిఆర్  మాట్లాడుతున్నారని అన్నారు. జీవన్ రెడ్డి అంటే తమకు గౌరవం ఉందని ఆయన కేసీఆర్ తో కలవడం కరెక్ట్ కాదన్నారు.తాము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన దాని కంటే ఎక్కువగానే 2039 వరకు అధికారంలో ఉంటామన్నారు. కెసిఆర్ 10 సంవత్సరాలలో అభివృద్ధి చేస్తుంటే తాము అడ్డం పడలేదని అన్నారు. తమ ప్రభుత్వంరాబోయే రెండు సంవత్సరాలలో ప్రజా సంక్షేమం కోసం రాబోయే క్యాబినెట్ మీటింగ్ లో అనేక పథకాలు  తీసుకు వస్తున్నామని వీటిని అమలు చేస్తే మళ్లీ మళ్లీ అధికారం మాదే అన్నారు. ఈ సమావేశంలో నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి.మార్కెట్ చైర్మన్ రమేష్. మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి కార్పొరేటర్లు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333