రేవంత్ రెడ్డికి పాడను ఇక తన జర్నీ బాపు కెసిఆర్ తోనే 

Apr 21, 2026 - 19:44
 0  3
రేవంత్ రెడ్డికి పాడను ఇక తన జర్నీ బాపు కెసిఆర్ తోనే 

గాయని మధుప్రియ 

బాపు కెసిఆర్ తెలంగాణకొక ఎమోషనల్ అని, ప్రతి ఇంట, ప్రతి హృదయంలో కెసిఆర్ ఉన్నారని గాయని మధుప్రియ అన్నారు. ఎటు చూసినా కూల్చివేతలు, కరెంట్ కష్టాలు, రైతుల ఇక్కట్లు మినహా ఈ ప్రభ్యత్వంలో ఇంకేం కనిపించడం లేదని, మళ్ళీ కెసిఆర్ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. సోమవారం జగిత్యాల బిఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు వచ్చిన మధుప్రియ మీడియాతో మాట్లాడారు.

భారీ సభలో తాను పాడి రెండేళ్లు అయ్యిందని, కాంగ్రెస్ ప్రభుత్వంలో తనకు అవకాశాలు రాలేదని మధుప్రియ తెలిపారు. తాను తెలంగాణ ఉద్యమంలో బాపు కెసిఆర్ తో జర్నీ చేసి ఎన్నో సభల్లో పాడానని, తనను సొంతబిడ్డలా చూసుకుంటారని ఆమె అన్నారు.  రేవంత్ రెడ్డి సభలకు పాడే సమస్య లేదని, ఇక తన ప్రయాణం కెసిఆర్ తోనే అని ప్రకటించారు. తనకు రాజకీయాలతో సంబంధం లేదని, తెలంగాణ ఉద్యమంలో ధూమ్ ధామ్ లో పాడిన అనుభవం, సకల జనుల సమ్మెలో పాల్గొన్న జ్ఞాపకం అన్నీ తనలో తెలంగాణ భావోద్వేగం ఇమిడి ఉందని, ఏ ప్రభుత్వంలోనైనా తెలంగాణ బిడ్డలకు మంచి జరగాలనే కోరుకుంటున్న అని ఆమె అన్నారు. తనను వివాదాల్లోకి లాగొద్దని మధుప్రియ కోరారు.

- డా. మహ్మద్ రఫీ

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333