తెలంగాణ విద్యార్థుల స్థానికతపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

తెలంగాణలో వరుసగా 9,10,11,12 తరగతులు చదివితేనే లోకల్ రిజర్వేషన్ వర్తిస్తుందన్న ప్రభుత్వ ఉత్తర్వులను సమర్థించిన సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన లోకల్ కోటా రిజర్వేషన్ల జీవో నెంబర్ 33ను సవాల్ చేస్తూ పిటిషన్ వేసిన విద్యార్థులు స్థానిక రిజర్వేషన్ల అంశంపై ప్రతి రాష్ట్రానికి నిబంధలను తయారు చేసుకునే అధికారం ఉంటుందని వాదించిన తెలంగాణ ప్రభుత్వం.. ఈ వాదనలను సమర్ధించి విద్యార్థుల పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీం చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ ఎంబీబీఎస్, బీడీఎస్, యూజీ కోర్సులకు వర్తించనున్న ఈ లోకల్ కోటా రిజర్వేషన్ గత ఏడాది ఇచ్చిన మినహాయింపులతో ప్రయోజనం పొందిన విద్యార్థులను అలాగే కొనసాగించాలని సూచించిన సుప్రీం ధర్మాసనం