కుటుంబ కలహాల తో నదిలో దుకేందుకు యత్నించిన మహిళను కాపాడిన ఇటిక్యాల పోలీసులు
జోగులాంబ గద్వాల 24 జులై 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి ఇటిక్యాల:-కుటుంబ కలహాలతో బీచుపల్లి పుష్కర ఘాట్ దగ్గరకు వచ్చి నదిలో దూకి చనిపోయేందుకు యత్నించిన వనపర్తి జిల్లా కు చెందిన మహిళను ఇటిక్యాల బ్లూ కొల్ట్స్ సిబ్బంది రక్షించి కౌన్సిలింగ్ చేసి వారి కుటుంబ సభ్యులకు అప్పగించిన సంఘటన చోటు చేసుకుంది.
వివరాలు: వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలము లోని ఒక గ్రామానికి చెందిన మహిళ , వయసు -26 సం " రాలు, కుటుంబ కలహాల తో జీవితం పై విరక్తి చెంది ఈ రోజు ఉదయం ఇటిక్యాల మండలం లోని బీచూపల్లి పుష్కర ఘాట్ కు వచ్చి నదిలో దూకేందుకు ప్రయత్నించగా అక్కడే విధులలో ఇటిక్యాల బ్లూ కోర్ట్స్ సిబ్బంది శ్రీనివాస్, వరద రాజులు ఆమెను గుర్తించి నదిలోకి వెళ్లకుండా అడ్డుకొని ఎర్రవల్లి లోని పోలీస్ ఔట్ పోస్టు నందు కొన్సిలింగ్ చేసి అనంతరం వారి కుటుంబ సభ్యులను పిలిపించి వారికి అప్పగించడం జరిగింది. తక్షణమే బ్లూ కోల్ట్స్ సిబ్బంది స్పందించి మహిళ ప్రాణాలను కాపాడటం పట్ల జిల్లా ఎస్పీ టి.శ్రీనివాస రావు బ్లూ కోల్ట్స్ సిబ్బందిని అభినందించారు.