పేకాట స్థావరం పై తప్పకుండా చర్యలు తీసుకుంటాం:జిల్లా ఎస్పీ

జోగులాంబ గద్వాల 24 జులై 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- గద్వాల ఈ నెల 13వ తేది నాడు ఉండవల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట స్థావరం పై దాడికి సంబంధించి పలు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ టి.శ్రీనివాస రావు వివరణ ను ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. పేకాట స్థావరం పై దాడి సందర్బంగా వచ్చిన ఆరోపణ దృష్ట్యా మరియు మీడియా మిత్రులు కూడా వివరణ కోరుతున్న సందర్బంగా ఇట్టి ఆరోపణ పై జిల్లా అదనపు ఎస్పీ శ్రీ కె. గుణ శేఖర్ ఆద్వర్యంలో పూర్తి విచారణకు ఆదేశించడం జరిగిందనీ , ఈ సంఘటనలో పోలీస్ అధికారులు గాని, సిబ్బంది గాని ఆరోపణ రుజువైతే అట్టి వారి పై తప్పకుండా శాఖ పరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎస్పీ తెలిపారు. అలాగే ఆరోపణలకు సంబంధించిన బాధితులు ఎవరైనా ఉంటె ముందుకూ వచ్చి నేరుగా లేద పోన్ లో తమని సంప్రదించి పిర్యాదు చేస్తే విచారణ చేపట్టి నిజమని తేలితే బాద్యుల పై తప్పకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని, అట్టి బాదితుల వివరాలు కూడా గోప్యంగా ఉంచబడుతాయని జిల్లా ఎస్పీ ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు.