మహిళకు జీవిత ఖైదీ శిక్ష.
- 6 సంవత్సరాల బాబు గొంతు నులిమి హత్య.
- సహజీవనానికి అడ్డుగా ఉన్నాడు అని 6 సం. రాల బాలుడు టైసన్ ను హత్య చేసిన యువత.
- 2023 సంవత్సరం సూర్యాపేట రూరల్ పీఎస్ పరిధిలో ఘటన.
- హత్య చేసిన నేరస్థురాలు కు జీవిత ఖైదీ శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించిన సూర్యాపేట కోర్టు.
కేసు వాదనలు, శిక్ష వివరాలు వెల్లడించిన ఎస్పీ నరసింహ
2023 సంవత్సరం ఆగస్టు నెలలో సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి మూడవ విడత ఇందిరమ్మ కాలనీలో నివాసం ఉంటున్న గరిడేపల్లి మండలం కొత్తగూడెం గ్రామానికి చెందిన మచ్చ మధు యొక్క 6 సంవత్సరాల కుమారుడు టైసన్ అకాలంగా మరణించగా బాలుడి నాయనమ్మ మచ్చ కమలమ్మ బాలుడి మరణంపై అనుమానం ఉన్నది అని సూర్యాపేట రూరల్ పీఎస్ నందు పిర్యాదు చేసినది. పిర్యాదుపై మొదట అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేయడం జరిగినది. అనంతరం పోస్టుమార్టం నివేదిక ఆధారంగా బాలుడిని గొంతు నులిమి హత్య చేసినట్లు నిర్ధారించి అప్పటి దర్యాప్తు అధికారి కేసును హత్య కేసుగా మార్పు చేసి సాంకేతిక ఆధారాలు సేకరించి హత్యచేసినది బాలుడి తండ్రి తో సహజీవనం చేస్తున్న మోతే మండలం సర్వారం గ్రామానికి చెందిన నల్లాల వాణి అలియాస్ రాణిగా గుర్తించి బలమైన ఆధారాలు, సాక్షుల వాగ్మూలం నమోదు చేసి నల్లాల వాణి, బాలుడు టైసన్ ను హత్య చేసి నేరానికి పాల్పడింది అని నేర అభియోగ పత్రాలు కోర్టుకు దాఖలు చేయడం జరిగినది. ఈ కేసులో బాధితులను సాక్షులను విచారించిన జిల్లా కోర్టు జడ్జి లక్ష్మీ ప్రసన్న గారు నిందితురాలు నేరానికి పాల్పడింది అని నిర్ధారించి నేరస్థురాలుగా తేల్చి జీవిత కాలం జైలు శిక్ష, 10 వేల రూపాయల జరిమానా విధించారు. దర్యాప్తు అధికారి ఇన్స్పెక్టర్, స్థానిక డీఎస్పీ, సిఐ ఈ కేసు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసినారు. బాధితుల తరపున పీపీ లక్ష్మణ్ రాథోడ్ కేసు వాదించగా, కోర్టు డ్యూటీ కానిస్టేబుల్ శోభన్ బాబు, కోర్టు లైజన్ అధికారి హెడ్ కానిస్టేబుల్ శ్రీకాంత్ లు కోర్టు అధికారులతో సమన్వయం చేసినారు.
మచ్చ మధు ఇంటర్ చదివేటప్పుడు కోడి స్వప్న అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి టైసన్ పుట్టిన సంవత్సరం తర్వాత తల్లి స్వప్న భర్తను, బాలుణ్ణి వదిలేసి వెళ్ళిపోయింది. అనంతరం మధు మోతే మండలం సర్వరానికి చెందిన నల్లాల వాణి అలియాస్ రాణి తో ఇందిరమ్మ కాలని మూడవ విడతలో సహజీవనం చేసేవారు. మధు, వాణిల సహజీవనానికి బాలుడు టైసన్ అడ్డుగా ఉన్నాడు అని భావించిన వాణి బాలుణ్ణి గొంతు నులిమి హత్య చేసినది.