తిరుమల శ్రీవారి సేవలో మంత్రి పొన్నం ప్రభాకర్
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సేవలో తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈరోజు తెల్లవారు జామున ఉదయం స్వామి వారిని అభిషేకం సేవలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. స్వామి వారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనం అందించారు. టీటీడీ అధికారులు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.