షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం

Apr 22, 2026 - 21:46
 0  1
షార్ట్ సర్క్యూట్ తో  ఇల్లు దగ్ధం

 తిరుమలగిరి 23 ఏప్రిల్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్

 తిరుమలగిరి మున్సిపాలిటీ 13వ వార్డు అంబేద్కర్ నగర్ కు చెందిన కొంగరి సోంమల్లు ఇంట్లో షార్ట్ సర్క్యూట్ జరగడం వలన ఇంట్లో ఉన్న సామాను పూర్తిగా కాలిపోవడం జరిగింది.ఈ విషయం తెలుసుకోని,అక్కడికి వెళ్లి వారి ఇంటిని సందర్శించి, తక్షణ సహాయం కింద 5000/-రూ..అందజేసిన తిరుమలగిరి మున్సిపాలిటీ చేర్మెన్ సంకెపల్లి రఘునందన్ రెడ్డి   వారితో పాటు 12వ వార్డు కౌన్సిలర్ కందుకూరి గీత బాబు గారు తదితరులు ఉన్నారు..

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి