అమరుల ఆశయ సాధనకై ముందుకు సాగుదాం విప్లవోద్యమ సీనియర్ నాయకులు, అమరుడు కామ్రేడ్ ఆరుట్ల శంకర్ రెడ్డి

Feb 23, 2024 - 18:05
 0  29
అమరుల ఆశయ సాధనకై ముందుకు సాగుదాం విప్లవోద్యమ సీనియర్ నాయకులు, అమరుడు కామ్రేడ్ ఆరుట్ల శంకర్ రెడ్డి

తెలంగాణ వార్త ఆత్మకూరు యస్ ప్రతినిధి అమరుల ఆశయ సాధనకై ముందుకు సాగుదాం విప్లవోద్యమ సీనియర్ నాయకులు, అమరుడు కామ్రేడ్ ఆరుట్ల శంకర్ రెడ్డి 2 వ వర్ధంతిని పురస్కరించుకుని రైతు కూలీ పోరాట సమితి ఆధ్వర్యంలో రామన్నగూడెం గ్రామంలోని మెయిన్ సెంటర్లో ఆరుట్ల శంకర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ రైతు- కూలి పోరాట సమితి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు: కామ్రేడ్ బొమ్మకంటి కొమరయ్య పాల్గొని మాట్లాడుతూ.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రామన్నగూడెం గ్రామం నాటి నుండి నేటి వరకు ఒక ఉద్యమ కేంద్రంగా ఉందని అన్నారు.భూస్వామ్య,పెత్తందారీ వ్యతిరేక పోరాటాలు, ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహించడంలో ఈ గ్రామం ముందుందని కొనియాడారు. గ్రామంలో మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన కామ్రేడ్ ఆరుట్ల శంకర్ రెడ్డి... దోపిడీ, పీడన, అసమానతలు లేని వ్యవస్థ కోసం, సమ సమాజం కోసం పోరాడినాడని అన్నారు. సారా వ్యతిరేక, భూస్వామ్య వ్యతిరేక పోరాటాలకు నాయకత్వం వహించారని కొనియాడారు. విప్లవోద్యమంపై కొనసాగుతున్న రాజ్య హింసకు వ్యతిరేకంగా ఉద్యమించినాడని అన్నారు. ఆయన పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అమరవీరుల త్యాగాలను ముందుకు తీసుకుపోవడం అంటే ప్రజా పోరాటాలను తీవ్రతరం చేయడమే అమరులకు మనం అర్పించే నిజమైన నివాళి అని అన్నారు. రైతు కూలీ పోరాట సమితి నాయకులు: పల్స యాదగిరి మాట్లాడుతూ...... కామ్రేడ్ ఆరుట్ల శంకర్ రెడ్డి 44 సంవత్సరాల విప్లవ రాజకీయ జీవితంలో 14 సంవత్సరాలు రహస్య జీవితాన్ని కొనసాగించినాడని, ఉద్యమంలో ఉద్యమ నిర్మాణంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నాడని, తన జీవిత కాలమంతా విప్లవ రాజకీయాల్లో కొనసాగినాడని ఈ సందర్భంగా కొనియాడినారు. కామ్రేడ్ ఆరుట్ల శంకర్ రెడ్డి అలుపెరగని పోరాటయోధుడు, విప్లవాన్ని జీవితంగా నమ్మిన నిస్వార్ధపరుడు, విప్లవ విలువలతో కూడిన ఆయన ఆదర్శ జీవితం రాబోయే తరానికి స్ఫూర్తిదాయకమని, ఆ కామ్రేడ్ ప్రజల హృదయాల్లో ఎప్పుడూ జీవించి ఉంటాడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రైతు కూలీ పోరాట సమితి నాయకులు: బెల్లి నాగరాజు, బత్తుల గురువయ్య రాచకొండ మల్లయ్య, జుజ్జురి సత్యం,లచ్చిరెడ్డి,పుల్లారెడ్డి, వెంకట్ రెడ్డి, సూర్యనారాయణ, లింగారెడ్డి, రామచంద్రు, బి వెంకన్న, మరియు అమరుడు కామ్రేడ్ ఆరుట్ల శంకర్ రెడ్డి జీవిత సహచరి ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఉద్యమాభివందనాలతో.. బత్తుల గురువయ్య (రైతు కూలీ పోరాట సమితి నాయకులు)