ఉద్యమకారుల ఫోరం నియోజకవర్గం అధ్యక్షునిగా అబ్దుల్ గఫార్ ఖాన్

May 19, 2026 - 21:58
 0  4
ఉద్యమకారుల ఫోరం నియోజకవర్గం అధ్యక్షునిగా అబ్దుల్ గఫార్ ఖాన్

  తెలంగాణ ఉద్యమకారుల ఫోరం(TUF) :

తుంగతుర్తి నియోజకవర్గ అధ్యక్షుడిగా  అబ్దుల్ గఫార్ ఖాన్

నాపై నమ్మకంతో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం (TUF) తుంగతుర్తి

నియోజకవర్గ అధ్యక్షునిగా ఎంపిక చేసినటువంటి రాష్ట్ర కోఆర్డినేటర్

అనంతుల మధు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను...

తిరుమలగిరి 20 మే 2026 తెలంగాణ వార్త రిపోర్టర్

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకై అమరవీరుల త్యాగఫలం అలాగే ఎంతోమంది కార్మిక కర్షక మేధావుల శ్రమ ఫలం ఉందని నూతంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరమ్ తుంగతుర్తి నియోజకవర్గ అధ్యక్షులుగా ఎన్ని కైనా అబ్దుల్ గఫార్ ఖాన్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 90 శాతం మంది వారి చదువును, వారి పనిని,చివరకు వారి ఆరోగ్యం సైతం త్యాగం చేసారు..అక్రమ కేసులు,లాఠీ దెబ్బలు తింటు జైలు జీవితాలు గడిపిన ప్రతీ ఒక్కరి వెనుక ఒక విషాద గాథ ఉంది.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, ప్రభుత్వాలు మారిన. ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నిజమైన ఉద్యమకారులకు నేటికీ ఎలాంటి   గుర్తింపు దక్కకపోవడం, రాజకీయంగా ఎలాంటి అవకాశాలు రాకపోవడం బాధాకరం విషయం  తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల్లో ఉన్న ఉద్యమకారులను స్వయంగా కలిసి, వారందరినీ ఏకం చేసి, వారి హక్కులు మరియు గుర్తింపు కోసం నిరంతరం పోరాడుతాం. రాబోయే రోజుల్లో (TUF) పరిధిలో అన్ని మండల.కమిటీలను బలోపేతం చేసి, ఉద్యమ సహచరులందరినీ కలుపుకొని హక్కుల సాధనకై మరింత బలంగా  ఉద్యమిస్తామన్నారు.. 

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి