అందరికీ రాజకీయ అవకాశం కల్పించాలి

Dec 29, 2024 - 18:26
Dec 29, 2024 - 21:16
 0  4
అందరికీ రాజకీయ అవకాశం కల్పించాలి

29/12/2024 చర్ల మండలం జనభా కు తగినంతగా రాజకీయ అవకాశాలు బిఎస్పీ లక్ష్యం. బహుజన్ సమాజ్ పార్టీ చర్ల మండల ప్రధాన కార్యదర్శిగా కొండా కౌశిక్ నియామకం జనాభాకు తగిన విధంగా రాజకీయ అవకాశాలను బబహుజన్ సమాజ్ పార్టీ అందిస్తుందని భద్రాచలం నియోజక వర్గ ప్రధాన కార్యదర్శి,చర్ల మండల ఇన్ చార్జ్ సామల ప్రవీణ్ అన్నారు. బహుజన్ సమాజ్ పార్టీ చర్ల మండల అద్యక్షులు చల్లగుండ్ల సతీష్ చౌదరి ఆద్వర్యంలో చర్ల మండల కేంద్రం లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శిగా ఇటీవల బిఎస్పీ పార్టీలో చేరిన కొండా కౌషిక్ ను నియమించారు.ఈ సందర్బంగా ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సామల ప్రవీణ్ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు.ఎస్సీ,ఎస్టీ,బిసి,మతమైనారిటీ ,ఆదిపత్య వర్గాలలోని పేదలకు జనాభా ప్రాతిపదికన విధ్య,ఉద్యోగ,ఉపాది,రాజకీయ అవకాశాలు కల్పించేందుకు బహుజన్ సామజ్ పార్టీ ఏర్పాటు అయిందని బహుజనులు ఈ విషయాన్ని గ్రహించి బహుజన రాజ్యాధికార ఉద్యమంలో బిఎస్పీ తో కలిసి నడవాలని పిలుపు నిచ్చారు.మండల ప్రధాన కార్యదర్శిగా మండల అద్యక్షుడు చల్లగుండ్ల సతీష్ చౌదరి చేతుల మీదుగా నియమించబడ్డ కొండా కౌషిక్ మాట్లాడుతూ పార్టీ తనపై పెట్టిన భాద్యత ను సక్రమంగా నిర్వహించి పార్టీ అభివృద్దికి,బహుజన రాజ్యాధికార సాకారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు.