ఎరువుల బుకింగ్ యాప్ పై రైతులకు అవగాహన కలిగించాలి
యూరియా, డిఏపి, కాంప్లెక్స్, ఇతర ఎలాంటి ఎరువులు కొనుగోలు చేయాలన్న ఫ్రేమ్ వర్క్స్ ఫర్ ఫర్టిలైజర్ ఆప్ ను వినియోగించడంపై రైతులకు అవగాహన కలిగించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు.
మంగళవారం సాయంత్రం శాంతినగర్ లోని పలు ఫర్టిలైజర్స్ దుకాణాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. యాప్ వినియోగంపై ప్రతి దుకాణం వద్ద బోర్డును ఏర్పాటు చేయాలన్నారు. వివిధ రకాల విత్తనాలు, ఎరువుల అమ్మకాల గురించి యజమానులతో మాట్లాడారు.
ఈ పర్యటనలో ఏడిఏ శివనాగిరెడ్డి, ఎంఏఓ రాధ, ఏఈఓ లు విమల, వినోద్ కుమార్, తదితరులున్నారు.
జారీ చేయువారు: డీపీఆర్ఓ/ జోగులాంబ గద్వాల జిల్లా.