అధ్వానంగా లింకు రోడ్లు
తిరుమలగిరి 16 డిసెంబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
తిరుమలగిరి మండలంలో వివిధ గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారులు గుంతలతో రాళ్లు తేలి అధ్వానంగా మారాయి తిరుమలగిరి కేంద్రం నుండి తాటిపాములకు వెలిశాల నుండి మర్రికుంట బండ్లపల్లి నుండి వెలిశాలకు వెళ్లే ప్రధాన దారులు అద్వానంగా ఉండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు నిత్యం గ్రామస్తులు దారుల వెంట రాకపోకలు సాగిస్తారు నిధులు మంజూరైన పనులు ప్రారంభం కాకపోవడంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు అధికారులు స్పందించి రోడ్డు పనులు చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు..