పుటాన్ దొడ్డి వాసికి గిన్నిస్ రికార్డు

Jun 2, 2026 - 19:43
 0  0
పుటాన్ దొడ్డి వాసికి గిన్నిస్ రికార్డు

 జోగులాంబ గద్వాల 2 జూన్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి :  ఎర్రవల్లి. మండలం పుటాన్ దొడ్డి గ్రామవాస్తవ్యులు గువ్వ పెద్ద బీసన్న  ద్వితీయకుమారుడు డా. రెవ, జి.బి. నాగవర్ధన్ రాజు కి ఒకటి కాదు, రెండు అధికారిక గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ టైటిళ్లను విజయవంతంగా సాధించారు. సాధించడానికి అద్భుతమైన పట్టుదల, అవసరమైన అంకితభావం అసాధారణమైన ప్రతిభకు గుర్తింపుగా మొదటి రికార్డ్ 2025 ఏప్రిల్ 04. న కర్ణాటక సంగీత సరళి స్వరాలను ఆలపిస్తు కీబోర్డ్ ప్లే చేసినందున గిన్నిస్ రికార్డు లో నమోదు కావడం జరిగింది. అలాగే రెండవ రికార్డ్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధుల సమక్షమున దక్షిణ భారతదేశ శాస్త్రీయ సంగీత సరళీస్వరములతోపాటు జాతీయ గీతాన్ని ఏకదాటిగా గంటపాటు ఆలపిస్తూ ఎలక్ట్రానిక్ మ్యుజికల్ కీబోర్డ్ ప్లే చేసినందువలన ప్రశంసా పత్రంను గిన్నిస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డ్ వారు అందించారు. వీరి అద్భుతమైన విజయాలు ఆచంచలమైన నిబద్ధత మానవ విజయ పరిధులను విస్తరింపజేశాయి, మనందరికీ ప్రగాఢమైన స్ఫూర్తిని అందిస్తున్నాయి. డా. రెవ, జి, బి, నాగవర్ధన్ రాజు  మనప్రాంతం వారు అయినందుకు ఇది మనందరికీ గర్వకారణం. మే 29న శుక్రవారము  ఈ పురస్కారం ప్రదానం చేయబడగా జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ చేతుల మీదుగా మరోసారి గిన్నిస్ రికార్డు అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అభినందించారు. గిన్నిస్ రికార్డ్ జిల్లా వాసికి రెండుసార్లు రావడం గర్వకారణం అని తెలిపారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333