ఉత్తమ ఉద్యోగి అవార్డు గ్రహీతలను సన్మానించిన సామాజిక కార్యకర్త గంధం సైదులు
మునగాల 16 ఆగస్టు 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- ప్రతి ఉద్యోగి తాము పనిచేసే చోట బాధ్యతగా విధులు నిర్వహించి ప్రజల మన్ననలు పొందాలని సోషల్ వర్కర్ గంధం సైదులు అన్నారు. అప్పుడే అలాంటి ఉద్యోగులకు ఉన్నత గౌరవం లభిస్తుందని అన్నారు. మునగాల మండలంలో రెవెన్యూ, పంచాయతీ, వైద్య శాఖల ఆధ్వర్యంలో ఉత్తమ సేవలందించి 78వ స్వాతంత్ర దినోత్సవ ఉత్సవాల సందర్భంగా సూర్యపేట జిల్లా కేంద్రంలో ఉత్తమ అవార్డులు అందుకున్న మునగాల మండల తాసిల్దార్ వి ఆంజనేయులు, మరియు ఉత్తమ ఏఎన్ఎం గా అవార్డు అందుకున్న రేపాల పిహెచ్సి పరిధిలో పనిచేస్తున్న మునగాలకు చెందిన ని బెజవాడ నర్సమ్మకు గురువారం తాసిల్దార్ ఆఫీసులో ఘన సన్మానం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నేను మాట్లాడుతూ పత్తి పట్ల అంకిత భావం చిత్తశుద్ధి కలిగి ఉంటే అలాంటి వారికి ఏదో ఒక రోజు గుర్తింపు వస్తుందని మునగాల మండల గ్రామాభివృద్ధికి జిల్లా స్థాయిలో నిలబెట్టిన వీరికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేయడం జరిగింది. ఇలాంటి ఉద్యోగం పూర్తిగా తీసుకొని మునుముందు మిగతా ఆఫీసర్లు, సిబ్బంది కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లి ఇలాంటి ప్రజా సమస్యల పరిష్కారం కోసం సేవ చేస్తూ ఇటు ప్రజల నుంచి అటు ప్రభుత్వం నుంచి మనల్ని పొందాలని కోరడం జరిగింది మన మునగాల మండలంలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ మునుముందు ఇలాంటి ఉత్తమ అవార్డులు రావాలని ఆ రకంగా ముందుకు పోవాలని ప్రతి ఉద్యోగులను కోరుకుంటున్నాను. అందుకు నా పూర్తి సహకారం అందిస్తానని చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ సత్యనారాయణ ఆర్ ఐ లు రామారావు అజయ్ స్వప్న తో పాటు ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు.
అభినందనలతో...
మీ..
గంధం సైదులు అలియాస్ ఈనాడు సైదులు, మునగాల