గద్వాల పట్టణంలో డీకే బంగ్లాలో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరైన జిల్లా బిజెపి అధ్యక్షులు.
జోగులాంబ గద్వాల 9 మే 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- గద్వాల. పట్టణంలో డికె.బంగ్లా లో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా అధ్యక్షుడు రామచంద్ర రెడ్డి మాట్లాడుతూ
20 రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న ఎలాంటి రిజర్వేషన్లు రద్దు చేయలేదు. భారత దేశాన్ని దాదాపు గా16 సంవత్సరాలు BJP పాలించింది.
కానీ, ఎక్కడా ఎన్నడూ రిజర్వేషన్లు తగ్గించలేదు.
370 ని రద్దు చేసి SC/ST/OBC లకు రిజర్వేషన్లు కల్పించింది.
మహిళలకు 33% రిజర్వేషన్లను కల్పించింది.
వికలాంగులకు 3% రిజర్వేషన్లు కల్పించింది.
వెనుకబడిన అగ్రవర్ణాలకు 10% రిజర్వేషన్లు కల్పించింది.
ముస్లిం అలీఘర్, జామియా యూనివర్సిటీ లలో తిరిగి SC/ST/OBC లకు రిజర్వేషన్లు కల్పించింది.
ఇన్ని చేసినా BJP రిజర్వేషన్లు రద్దు చేస్తుంది అంటూ అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. గొంతులు కోసే కసాయి కాంగ్రెస్ పార్టీని నమ్ముతున్నారని అన్నారు.
నెహ్రూ హయాంలో ముస్లిం అలీఘడ్ యూనివర్సిటీ లో SC/ST లకు అప్పటి వరకు ఉన్న రిజర్వేషన్లను తొలగించింది.
ఆర్టికల్ 370 ద్వారా జమ్మూ-కాశ్మీర్ లో SC/ST/OBC లకు ఉన్న రిజర్వేషన్లను తొలగించింది.
ఆర్టికల్ 371 ద్వారా ఈశాన్య రాష్ట్రాలలో కూడా రిజర్వేషన్లను తగ్గించింది.
2011 సోనియా గాంధీ హయాంలో జమాతే ఇస్లామీయ యూనివర్సిటీ లో ఉన్న SC/ST/OBC ల రిజర్వేషన్లను తగ్గించింది.
కేరళ, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక లో ముస్లింలను BC లలో కలిపి వారికి 6% రిజర్వేషన్లను కల్పించి OBC లకు ద్రోహం చేసింది!
2013 లో OBC ల కోటా 27% నుండి 4% తగ్గించి ముస్లిలకు కట్టబెట్టే చట్టం తయారు చేసింది.
మహిళలకు 33% రిజర్వేషన్ల బిల్లు / చట్టం తయారు చేయడానికి వెనుకాడింది.
ఇన్ని చేసినా కళ్ళులేని కబోదుల్లా...
గొర్రెకసాయి వాడిని నమ్మినట్లు... కాంగ్రెస్ మాత్రమే రిజర్వేషన్లకు రక్షణ అంటూ... నమ్ముతున్నారు!
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు.
అంబేద్కర్ రాజ్యాంగం మాకు పవిత్ర గ్రంధం అన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చాలాసార్లు చెప్పారు. రాజ్యాంగం మార్చే ప్రసక్తే ఉండదని అన్నారు..
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రవి కుమార్ ఎక్బోటే,అసెంబ్లీ కన్వీనర్ రామాంజనేయులు కోకన్వీనర్ శ్యామ్, కౌన్సిలర్లు త్యాగరాజు, బండల పాండు, బిజెపి సీనియర్ నాయకులు రజక నరసింహులు, లత్తి పురం రామీ రెడ్డి, దాసు, అనిల్, ఓంకార్ తదితరులు హాజరయ్యారు..