ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన ..
ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన
శ్రీనిధి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల ఆధ్వర్యంలో
వైద్య పరీక్షలు చేసి, మందుల పంపిణీ
తెలంగాణ వార్త సూర్యాపేట జిల్లా ప్రతినిధి..
సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని దూరజ్ పల్లి లో హైదరాబాద్ కి చెందిన శ్రీనిధి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల ఆధ్వర్యంలో బాచ్పన్ ప్రయస్ సహకారంతో శనివారం ఉచితం మెగా వైద్య శిబిరం ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి డిఎస్పి జి రవి హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు.. ఖమ్మం పట్టణానికి చెందిన ఆర్కా హాస్పిటల్ వైద్య సిబ్బందితో సుమారు 400 మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి వారికి అవసరమైన మెడిసిన్ ని వరల్డ్ వైడ్ ఏడ్జ్ కన్సల్టెన్సీ సహకారంతో ఉచితంగా మందుల పంపిణీ చేశారు.. ఈ సందర్భంగా కళాశాల శ్రీనిధి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు మాట్లాడుతూ శనివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించామని, ఆదివారం పాఠశాల విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లీష్, వ్యాసరచన పోటీలు, వివిధ పోటీ పరీక్షలకు అవసరమైన అంశాల పై అవగాహన కల్పిస్తూ క్లాసులు నిర్వహిస్తున్నామని తెలిపారు..
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ షేక్ బాషా, ఆసిఫ్, తాజ్, రాహీం ,యాసిన్,నాసిర్ దురాజ్పల్లి యువకులతో పాటు శ్రీనిధి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.. ఈ కార్యక్రమం షేక్ ఆసిఫ్ భాష ఆధ్వర్యంలో జరగడం జరిగింది