ఉగాది నూతన సంవత్సరలో పంచాంగం చూయించుకుంటున్న గ్రామస్తులు

తెలంగాణ వార్త ఆత్మకూరుఎస్ ఘనంగా ఉగాది వేడుకలు. ఆత్మకూరు ఎస్.. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని మండల పరిధిలోని గ్రామాల్లో వేడుకలు నిర్వహించారు. పలు ఆలయాల్లో పూజలు పంచాంగ శ్రవణాలను నిర్వహించారు. తెలుగు సంవత్సరం చైత్రమాసం ప్రారంభం సందర్భంగా గ్రామాల్లో ఉగాది వేడుకలు అత్యంత ఉత్సాహంగా నిర్వహించుకున్నారు. వేద బ్రాహ్మణులు ఈ ఏడాది ప్రజలకు జరిగే శుభ సూచికలను పంచాంగ శ్రవణాల ద్వారా వివరించారు. ఆత్మకూరులో శ్రీ రంగాచారి ఆచార్యులు పాతర్లపాడులో శ్రవణ్ కుమార్ పౌరోహితులు, గ్రామంలోని ఆలయంలో పంచాంగాన్ని వివరించారు. ప్రజలు మామిడి తోరణాలతో ఇళ్లను అలంకరించుకుని షడ్రుచులు కల ఉగాది పచ్చడి పిండి వంటలు చేసుకొని ఘనంగా పండుగ వేడుకలు జరుపుకున్నారు.