31న అసెంబ్లీ ముట్టడిని జయప్రదం చేయండి పి.డి.ఎస్.యు

Jul 29, 2024 - 21:12
 0  5
31న అసెంబ్లీ ముట్టడిని జయప్రదం చేయండి పి.డి.ఎస్.యు

తెలంగాణ వార్త ఆత్మకూరు యస్ విద్యారంగానికి 30 శాతం నిధులు కేటాయించాలి 31న అసెంబ్లీ ముట్టడిని జయప్రదం చేయండి పి.డి.ఎస్.యు డివిజన్ ప్రధాన కార్యదర్శి పిడమర్తి భరత్ పివైఎల్ జిల్లా కోశాధికారి బండి రవి* కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో విద్యార్థులకు నిరుద్యోగులకు న్యాయం చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో విద్యార్థులను యువకులను అన్యానికి గురిచేసిందని పి.డి.ఎస్.యు డివిజన్ ప్రధాన కార్యదర్శి పిడమర్తి భరత్ పివైఎల్ జిల్లా కోశాధికారి బండి రవి అన్నారు. ఆత్మకూరు(S)మండల కేంద్రంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో విద్యారంగానికి 7.3% మాత్రమే నిధులు కేటాయించి చేతులు దులుపు పొందని వారు అన్నారు. ఎన్నికల సమయంలో అనేక వాగ్దానాలు ఇచ్చి విద్యార్థులకు నిరుద్యోగులకు బడ్జెట్లో కనీస ప్రాధాన్యత కూడా ఇవ్వలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కపిల్ సిబాల్ నివేదిక ప్రకారం 30% నిధులు కేటాయిస్తేనే విద్యారంగానికి న్యాయం జరుగుతుందని చెప్పినప్పటికీ కనీసం ప్రాధాన్యత కూడా ఇవ్వకుండా ఏడు శాతానికి దిగజారి బడ్జెట్ ఇవ్వటం ఎంతవరకు న్యాయమని వారు అన్నారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలో భాగంగా ఉద్యోగ క్యాలెండర్ గురించి కనీసం మాట్లాడే పరిస్థితి కూడా లేదని వారన్నారు. వెంటనే నిరుద్యోగులకు ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేసి ఖాళీగా ఉన్న అన్ని రకాల ఉద్యోగ పోస్టులను భర్తీ చేయాలని, విద్యారంగానికి 30 శాతం నిధులు కేటాయించాలని, ప్రతి గ్రామంలో సీజనల్ వ్యాధుల పట్ల వైద్యులను అప్రమత్తం చేసి సరైన వైద్యం అందించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. లేనిపక్షంలో 31న చలో అసెంబ్లీ కార్యక్రమం పి డి ఎస్ యు, పి వై ఎల్ ఆధ్వర్యంలో నిర్వహించి తీరుతామని వారు హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చి విద్యార్థులను నిరుద్యోగులను ఆదుకోవాలని కోరారు లేనిపక్షంలో దేనికైనా సిద్ధమని వారు హెచ్చరించారు. ఈ సమావేశంలో PDSU PYL నాయకులు అనంతల సందీప్, మహేష్,వరుణ్,సాయి, తదితరులు పాల్గొన్నారు.