ఇటిక్యాలగ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

Aug 22, 2026 - 16:42
Aug 22, 2026 - 16:43
 0  9
ఇటిక్యాలగ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
ఇటిక్యాలగ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

జోగులాంబ గద్వాల 22 ఆగస్టు 2020 ఆరు తెలంగాణవార్త ప్రతినిధి:- మండలంలోని ఇటిక్యాల గ్రామపంచాయతీలో సర్పంచ్ జీవన్ రెడ్డి &  తహసిల్దార్ ఆధ్వర్యంలో గ్రామంలోని అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. కార్యక్రమానికి ఇటిక్యాల తహసిల్దార్ శ్రీకాంత్ రెడ్డి హాజరై లబ్ధిదారులకు కార్డులను అందజేశారు. తహసిల్దార్ శ్రీకాంత్ రెడ్డి  మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ స్మార్ట్ రేషన్ కార్డులతో రాష్ట్రంలో ఎక్కడి నుండైనా రేషన్ తీసుకునే సౌకర్యం కలుగుతుంది. డిజిటల్ వ్యవస్థ ద్వారా అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా రేషన్ సరుకులు అందుతాయి. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూస్తాము" అని  శ్రీకాంత్ రెడ్డి.తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ ఇన్స్పెక్టర్ మదన్మోహన్ జిపిఓ పంచాయతీ కార్యదర్శి రేషన్ డీలర్ యుగంధర్ రెడ్డి గ్రామ ప్రజలు తదితరులు ఉన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333