సూర్యాపేట ప్రజల చిరకాల వాంఛ రైల్వే లైన్ సాధించి తీరుతాం
రైల్వే సాధన సమితి చేసే పోరాటానికి జర్నలిస్టుల పూర్తి మద్దతు ...
బుల్లెట్ ట్రైన్ సాధన సమితి అఖిలపక్షం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలో కూర్చున్న జర్నలిస్టులు ...
సంఘీభావం తెలిపిన మాజీ ఎమ్మెల్యేలు, గుమ్మడి నరసయ్య సంకినేని వెంకటేశ్వర్ రావు...
సూర్యాపేట ప్రజలకు చిరకాల వాంఛ అయిన రైల్వే లైన్ ను సాధించుకునేందుకు బుల్లెట్ సాధన సమితి అఖిలపక్షం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నప్పటికీ ప్రభుత్వాలు స్పందించకపోవడం దారుణమని మాజీ ఎమ్మెల్యేలు గుమ్మడి నరసయ్య, సంకినేని వెంకటేశ్వర్ రావు లో అన్నారు. జాతీయ రహదారి 65కు సమాంతర బుల్లెట్ ట్రైన్ సాధన కోసం బుల్లెట్ సాధన సమితి అఖిలపక్షం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 11వ రోజు రిలే నిరాహార దీక్షలో సోమవారం జర్నలిస్టులు కూర్చోవడంతో వారికి మద్దతు పలికారు. ఈ సందర్భంగా దీక్షలో కూర్చున్న జర్నలిస్ట్ జేఏసీ నాయకులు వజ్జే వీరయ్య, గుండ శ్రీనివాస్ గుప్తా లు మాట్లాడుతూ సూర్యాపేట జిల్లా కేంద్రానికి రైల్వే లైన్ వస్తే ఈ ప్రాంతమంతా సామాజికంగా, ఆర్థికంగా అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందన్నారు. మొదటగా సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్ అలైన్మెంట్ జరిగినప్పటికీ దాన్ని పక్కదారి పట్టించి రాజకీయాలు చేశారని ఆరోపించారు. రైల్వే లైన్ ఉన్న వైపే మరో రైల్వే లైను వేయడంలో అర్థం లేదన్నారు. ఇప్పటికైనా జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు నాయకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసి మొదట కేటాయించినట్లుగా సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్ అలాట్మెంట్ జరగాలన్నారు. బుల్లెట్ ట్రైన్ సాధన కోసం రైల్వే సాధన సమితి అఖిలపక్షాల ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రతి పోరాటానికి తమ వంతు మద్దతు ఉంటుందన్నారు. ఈ దీక్షలో జర్నలిస్ట్ జేఏసీ నాయకులు వాసా చంద్రశేఖర్, అయితగాని రాంబాబు, భూపతి రాములు,గుణగంటి సురేష్, నాయని శ్రీనివాస్ రావు, బుక్క రాంబాబు, మల్లికార్జున్, సుంకర బోయిన వెంకటయ్య, ఫణీంద్ర నారాయణ, ఊట్కూరి రవీందర్, కొడిదల రాజబాబు, కందుకూరి యాదగిరీ, దన్యాకుల వెంకటేశ్వర్లు, రవి, శ్రీనివాస్ తదితరులు దీక్షలో కూర్చున్నారు. వీరికి మాజీ జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్, మాజీ మార్కెట్ చైర్మన్ పెద్దిరెడ్డి రాజా, మండాది డేవిడ్ కుమార్, పోలబోయిన కిరణ్, రాపర్తి శ్రీనివాస్, తదితరులు సంఘీభావం తెలిపారు.
ఢిల్లీకి చేరేవరకు ఉద్యమించాలి
జర్నలిస్టు దీక్షకు సంఘీభావం కార్యక్రమంలో కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ టూరిజం శాఖ మాజీ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి..
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బుల్లెట్ ట్రైన్ అలైన్మెంట్ మార్చడంలో జరిగిన తప్పిదాన్ని పాలకులు వెంటనే సరిదిద్దుకొని నేషనల్ హైవే 65 రహదారి వెంట బుల్లెట్ ట్రైన్ సాధన అలైన్మెంట్లు కొనసాగించి జాతీయ రహదారి 65 వెంట ఉన్న పట్టణాలకు న్యాయం చేయాలని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, టూరిజం శాఖ మాజీ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట పట్టణంలో సోమవారం బుల్లెట్ రైన్ సాధన అఖిలపక్ష పోరాట కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు జర్నలిస్టులు పాల్గొనగా వారి దీక్షకు సంఘీభావం తెలిపి వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ ఆరుట్ల జానకి రెడ్డి, వెలుగు ఎంకన్న, రమణాచారి,మల్లు నాగార్జున రెడ్డి, ధర్మార్జున్,కొత్తపల్లి శివకుమార్ రేణుక,కర్నాటి కిషన్, చలమల నరసింహ, బుర్ర వెంకటేశ్వర్లు, కునుకుంట్ల సైదులు,మట్టపల్లి సైదులు, వెలుగు వనిత, పేర్ల నాగయ్య, నేరెళ్ల మధు, షర్టు నాగయ్య, తదితరులు పాల్గొన్నారు.