పెంచికలపాడుకు బస్సు సౌకర్యం కల్పించాలి

గ్రామ సర్పంచ్ కె. ఆంజనేయులు

Aug 22, 2026 - 16:40
 0  6
పెంచికలపాడుకు బస్సు సౌకర్యం కల్పించాలి

జోగులాంబ గద్వాల 22 ఆగస్టు 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- మండలం పరిధిలోని పెంచికలపాడు గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని గ్రామ సర్పంచ్ కె. ఆంజనేయులు, ఉప సర్పంచ్ ముహమ్మద్, డిపో మేనేజర్ శ్రీధర్‌కు శనివారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, గ్రామంలో బస్సు సౌకర్యం లేక విద్యార్థులు, మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ముఖ్యంగా విద్యార్థులు ప్రతిరోజూ పెంచికలపాడు స్టేజీ వరకు కాలినడకన వెళ్లి అక్కడి నుంచి బస్సులో గద్వాలకు వెళ్లి విద్యను అభ్యసిస్తున్నారని పేర్కొన్నారు. గ్రామ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ అధికారులు స్పందించి బస్సును నేరుగా గ్రామంలోకి నడపాలని సర్పంచ్ కె. ఆంజనేయులు కోరారు. బస్సు సౌకర్యం కల్పిస్తే విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, గ్రామ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ఎండి ఖలీల్ పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333