జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా వీరనారి ఐలమ్మ జయంతి వేడుకలు

Sep 26, 2024 - 17:19
Sep 26, 2024 - 17:35
 0  2
జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా వీరనారి ఐలమ్మ జయంతి వేడుకలు

జోగులాంబ గద్వాల 26 సెప్టెంబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- గద్వాల తెలంగాణ వీర వనిత, దైర్య శాలి,తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ 129 వ జయంతి వేడుకలు జిల్లా పోలీసు కార్యాలయములో గురువారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భముగా జిల్లా ఎస్పీ టి.శ్రీనివాస రావు తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు.ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ నిరంకుశ రజాకార్లకు వ్యతిరేఖంగా మొక్కవోని ధైర్యంతో ఐలమ్మ ఎదిరించిన తీరు అందరికీ ఆదర్శమని ఐలమ్మ పోరాటాలను కొనియాడారు. ఆమె చేసిన పోరాట ఉద్యమమే తెలంగాణ సాయుధ పోరాటానికి స్ఫూర్తి అని,మహిళా చైతన్యానికి, ఆత్మగౌరవానికి ప్రతిక అని మహిళలందరూ ఆమెను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ శ్రీ కె.గుణ శేఖర్ , డి.ఎస్పి సత్యనారాయణ,సాయుధ దళ డి.ఎస్పి నరేందర్ రావు, అన్ని సర్కిల్ ల సీఐ, అన్ని పోలీస్ స్టేషన్ ల ఎస్సై లు, జిల్లా పోలీస్ కార్యాలయ అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333