ఇక్కడ అంబులెన్స్ సౌకర్యం ఎక్కడ .....??
తిరుమలగిరి 02 నవంబర్ 2024 తెలంగాణ వార్త రిపోర్టర్
సకాలంలో అందని వైద్యం....
జాజిరెడ్డిగూడెం నాగారం తిరుమలగిరి మూడు మండలాలకు ఒకటే అంబులెన్స్ సర్వీస్.....
ప్రైవేటు అంబులెన్స్ లకు కాసుల పంట...
తీవ్ర ఇబ్బందుల్లో పేద ప్రజలు....
తిరుమలగిరి మండలంలో 108 వాహనం లేదు ఎవరికైనా ఆపద వస్తే సమీపంలోని జాజిరెడ్డిగూడెం మండలం నుంచి రావాల్సి ఉంటుంది రెండు మండలాల మధ్య 20 కిలోమీటర్లు దూరం ఉంటుంది రెండు లేద మూడు ప్రమాదాలు జరిగిన సందర్భాల్లో 108 సమాచారం అందిన సకాలంలో లేకపోవడంతో కొంతమంది ప్రాణాలు కోల్పోయారు .. తిరుమలగిరి మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రస్తుతం ఉదయం 9 నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు మాత్రమే పనివేళ సమయం ఏ చిన్న అత్యవసరం వైద్యం అవసరం అయినా సూర్యపేట జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తారు. తిరుమలగిరి మండలం క్రింద 16 గ్రామపంచాయతీలు పలు గిరిజన తండాలు కలిగి ఉన్న మండలానికి ప్రభుత్వ అత్యవసర వాహనం అయిన 108 అంబులెన్స్ సర్వీస్ లేకపోవడం గమనార్హం. రాత్రి సమయాలలో అత్యవసర సమయం పాముకాటు, విషం తీసుకోవడం, రోడ్డు ప్రమాదాలు, గర్భిణీ స్త్రీలకు పురిటి నొప్పులు రావడం, ఏ ఇతర అత్యవసర సమయం ఏర్పడితే ఆస్పత్రికి అత్యవసరంగా వెళ్లడానికి ప్రభుత్వ అంబులెన్స్ సర్వీస్ లేదు. ప్రైవేటు వాహనాలలో తీసుకువెళ్తే సమయం బాగుంది కదా అని ఎక్కువ మొత్తంలో డబ్బులు దండుకుంటున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని సంబంధిత అధికారులు ప్రజలకు అత్యవసర వైద్య సేవలు అందించడానికి ఒక అంబులెన్స్ ఏర్పాటు చేయాలి. అంబులెన్స్ సర్వీస్ లేకపోవడం ద్వారా అత్యవసర సమయాలలో ఆసుపత్రికి సమయానుకూలంగా వెళ్ళని పక్షంలో మార్గమధ్యంలోనే ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. అంబులెన్స్ సర్వీస్ ఉంటే సమయానికి ఆస్పత్రికి చేరి వైద్యం పొందడం ద్వారా ఎంతో మంది ప్రాణాలతో ఉంటారు. సూర్యపేట జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లడం కష్టతరంగా మారుతున్నది. అలా వెళ్ళిన సందర్భాల్లో మార్గమధ్యంలోనే ప్రాణాలు వదులుతున్నారు. ఆసుపత్రికి వెళ్లడానికి దాదాపు 30 నిమిషాల నుంచి గంట సమయం పడుతుంది. అత్యవసర సమయంలో వైద్యసేవలు సకాలంలో అంది ప్రాణాలు నిలవాలి అంటే ఒక అత్యవసర 108 అంబులెన్సు సర్వీసును తిరుమలగిరి మండలానికి కేటాయించి. ఈ మండల ప్రజల యొక్క అత్యవసర వైద్యం అందించేలా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు.