ఇందిరమ్మ ఇళ్లకు ఇవీ గైడ్​లైన్స్ ...రేషన్ కార్డు ప్రకారం దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారు అర్హులు..

Mar 13, 2024 - 20:47
 0  11
ఇందిరమ్మ ఇళ్లకు ఇవీ గైడ్​లైన్స్ ...రేషన్ కార్డు ప్రకారం దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారు అర్హులు..

తొలి దశలో సొంత జాగా ఉన్న వారికి ప్రాధాన్యం. లబ్ధిదారుడు గ్రామం లేదా అర్బన్ లోకల్ బాడీలో నివాసితుడై ఉండాలి. అద్దెకు ఉన్నవారు అర్హులే. లబ్ధిదారుల ఎంపిక జిల్లా ఇన్​చార్జి మంత్రి అధ్యక్షతన కలెక్టర్లు ఫైనల్ చేస్తారు. గ్రామ పంచాయతీల జనాభాకు అనుగుణంగా ఎంపిక ఉంటుంది.  400 ఎస్​ఎఫ్​టీల విస్తీర్ణంలో ఆర్​సీసీ పద్ధతిలో ఇండ్లు నిర్మించాలి. లబ్ధిదారుల ఎంపిక తరువాత ఆ లిస్టును గ్రామ సభలు, పట్టణాల్లో అయితే వార్డు మీటింగ్​లో ప్రవేశపెడతారు. జిల్లా ఇన్​చార్జ్ మంత్రిని సంప్రదించి  ఆ మంత్రి ఆమోదంతో తుది జాబితాను కలెక్టర్ ఫైనల్ చేస్తారు. 

నాలుగు దశల్లో ఆర్థిక సాయం

బేస్​మెంట్ లెవల్​కు రూ.1 లక్ష స్లాబ్ లెవల్​కు రూ.1 లక్షస్లాబ్ పూర్తయిన తరువాత రూ.2 లక్షలు
ఇల్లు పూర్తయిన తరువాత రూ.1 లక్ష. కాగా జిల్లా కలెక్టర్లు, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమోదించిన హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ ఫండ్స్ రిలీజ్ చేసి ఆర్థిక సాయాన్ని డీబీటీ ( డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్ ) పద్ధతిలో ఆధార్ పేమెంట్ బ్రిడ్జ్ సిస్టమ్ ద్వారా లబ్ధిదారులకు చెల్లిస్తారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333