ఇందిరమ్మ ఇళ్ల పేరుతో జోరుగా ఇసుక దందా

Oct 24, 2025 - 21:09
 0  17
ఇందిరమ్మ ఇళ్ల పేరుతో జోరుగా ఇసుక దందా

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్  ప్రవహిస్తున్న ఏటి నుండి నీళ్ల లోతుడుతున్న ఇసుక... ఇందిరమ్మ ఇళ్ల పేరుతో జోరుగా దందా... ట్రాక్టర్ ఇసుక 10వేలు.... పట్టించుకోని అధికారులు.. ట్రాక్టర్ల వద్ద కింది స్థాయి సిబ్బంది చేతి వాటం.. ఆత్మకూర్ ఎస్... ఇందిరమ్మ ఇళ్ల పేరుతో జోరుగా ఇసుక దందా కొనసాగుతుంది. మండలం లోని మక్త కొత్త గూడెం,ఏపూర్, రామన్న గూడెం ఏటి నుండి రాత్రి వేళల్లో నే కాకుండా పగటి పూట కూడా విచ్చల విడిగా ఇసుక అక్రమ రవాణా కొనసాగుతుంది. పోలీసులు కేసులు నమోదు చేస్తున్నప్పటికీ ఇసుక దందా సాగుతుంది. రాత్రి వేళల్లో కొందరు పోలీసు సిబ్బంది పెట్రోలింగ్ పేరుతో ఆయా ఇసుక దందా ప్రాంతాలకు వెళ్లి ట్రాక్టర్ల దగ్గర ముడుపులు వసూలు చేసుకుని ఇసుక తరలింపును చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నట్లు గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇటీవల భారీ వర్షాలు రావడం తో ఏటి ప్రవాహం నిండుగా ప్రవహిస్తున్న నీటిలో నుండి ఇసుక ను తీసి బయట కుప్పలు గా పోసి ట్రాక్టర్ లకు నింపి 8, నుండి 10వేల కు ట్రాకర్ ఇసుక చుట్టు పక్కల గ్రామాలకు విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.ఇందిరమ్మ ఇండ్ల కు ఒకో ఇల్లుకు 20ట్రిప్పులు అవసరం ఉండగా ప్రభుత్వం ఇచ్చే 5లక్షలు సగం డబ్బులు ఇసుక కే ఖర్చు అవుతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గురువారం,మక్త కొత్తగూడెం లో కూడలి కి చెందిన ట్రాక్టర్లు నీటి నుండి ఇసుక తీస్తుండగా గ్రామస్తులు, రైతులు అడ్డుకున్న ఇసుక దందా ఆగడం లేదని ఆరోపించారు. ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక అనుమతులు ఇవ్వాలంటూ మండల అధికారుల కు వినతి పత్రాలు ఇచ్చి విచ్చల విడిగా ఇసుక బయటకు అధిక రెట్ల కు విక్రయిస్తున్నారని ఆరోపించారు. అధిక ధరలకు అలవాటు పడిన ఇసుక ట్రాక్టర్లు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కు ఇసుక అమ్మడం లేదని ఆరోపించారు. ఇసుక ట్రాక్టర్ల ను అరికట్టడం లో అధికారులు విఫలం అవుతున్నారని విమర్శలు వస్తున్నాయి. కింద స్తాయి సిబ్బంది ఇసుక ట్రాక్టర్ల వద్ద చేతి వాటానికి అలవాటు పడడం కూడా ఇసుక రవాణా కు అడ్డు అదుపులేకుండా పోయిందని ఆరోపణలు వస్తున్నాయి. పోలీసులు రెవిన్యూ అధికారులు ఇసుక రవాణాను అరికట్టి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కు ఇసుక కొరత లేకుండా చూడాలని కోరుతున్నారు.