ధ్వంసమైన చెక్ డ్యాం కాలువ, కట్ట కింద లీకేజీ
పెబ్బేరు, 26 జూలై 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- పెబ్బేరు మండల పరిధిలో చిల్మెల్ల సమీపన తాటిమాను గతంలో కొన్ని సంవత్సరాల క్రితమే డ్యాం నిర్మించారు గండ్లు పడడం కట్ట కింద లీకేజీలు కావడం, ఆయకట్టు చెక్ డాం 2016లో కొందరు కాంట్రాక్టర్లు కలిసి మైనర్ రిపేర్ చేసి పైపై మెరుగులు అద్దినట్లుగా పనులు చేశారు. దాని వ్యాయా నిర్మాణనికి 15 లక్షలు హెచ్చించారు.ఇప్పటికీ ఆ చెక్ డ్యాము, కాలువలు ధ్వంసం కావడంతో మట్టి తేలిపోయి ధ్వంసం అవడం జరిగింది. అదేవిధంగా డ్యాము వెనక భాగాన చాలా ఇసుక మేదు పెట్టింది, ముందుకు ఉండే రైతుల పొలాలకు నీరు పోవడం లేదు ఈ చెక్ డాం ఆయకట్టు కింద దాదాపుగా 70 ఎకరాల సేద్యము జరుగుతుంది. అందుకు చేద్దాం కింది రైతులు నీళ్లు రాక ఆందోళన చెందుతున్నారు అందుకు సంబంధిత అధికారులు మరియు స్థానిక ఎమ్మెల్యే,చొరవ తీసుకొని, రైతులకు న్యాయం చేయాలని కోరుతూన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు దేవన్న గౌడు రవీందర్ గౌడ్ రామకృష్ణ.