డ్రగ్స్ నివారణ ప్రతి ఒక్కరి భాధ్యత

Mar 10, 2025 - 20:21
 0  6
డ్రగ్స్ నివారణ ప్రతి ఒక్కరి భాధ్యత

తెలంగాణ వార్త ఆత్మకూరుఎస్ *డ్రగ్స్ నివారణ ప్రతి ఒక్కరి భాధ్యత* ఆత్మకూర్ ఎస్.. మండలం లోని ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరు డ్రగ్స్ గంజాయి నీ నివారణ చేయాల్సిన బాధ్యత మన అందరి పైన ఉన్నదని యం పి ఓ బి రాజేష్ తెలంగాణ సాంస్కృతిక సారధి జిల్లా టీమ్ లీడర్ పల్లెల లక్ష్మణ్ లు అన్నారు. సోమవారం మండల పరిధిలోని నెమ్మికల్ గ్రామం లో తెలంగాణ సాంస్కృతిక సారధి ఆద్వర్యం లో ఏర్పాటు చేసిన కళా జాత ప్రదర్శన అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా డ్రగ్స్ గంజాయి నివారణ పై చర్యలు చేపడుతుందని తెలిపారు చిన్న వయస్సు పిల్లలు విద్యకు దూరం మై మత్తుకు అలవాటు పడి వారి అమూల్యమైన జీవితాలను చింద్రం చేసుకుంటున్నారని తెలిపారు ఈ కార్యక్రమం లో తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు గంట బిక్ష పతి పల్లెల రాము వేముల శ్రవణ్ కుందమల్ల నాగలక్ష్మి వంటే పాక ప్రియాంక మేడి ప్రియ దర్శిని మేడి ఇంద్రజ తదితరులు పాల్గొన్నారు