సాసనులు గ్రామంలో ఎద్దుల దొంగతనం

జోగులాంబ గద్వాల17 మార్చి 2025 తెలంగాణ వార్త ప్రతినిధి: ఎర్రవల్లి. మండలం లోని సాసనూలు గ్రామంలో ఇద్దరు అన్నదమ్ములవి ఎద్దుల దొంగతనం జరిగింది. బోయ మద్దిలేటి తండ్రి ఈదన్న, మరొకటి బోయ లక్ష్మీనాయుడు తండ్రి తలారి ఈదన్న సంబంధించిన వారి ఒక్కొక్క ఎద్దులను గుర్తుతెలియని వ్యక్తులు దొంగలించారని బాధితులు వాపోయారు. చెరొకరి ఎద్దులను ఎత్తుకెళ్లిన దొంగలు. రాత్రి తొమ్మిది గంటల 30 నిమిషాలకు ఇద్దరు అన్నదమ్ములు ఎద్దులకు మేత వేసి ఇంటికి తిరిగి వచ్చారు. మళ్లీ తెల్లవారుజామున నాలుగు గంటలకు ఎద్దుల దగ్గరికి వెళ్లి చూడగా చెరొక్కరి ఎద్దు లేవని లబోదిబోమంటున్నారు అప్పుడు గ్రామస్తులు అందరూ వెళ్లి చూశారు వెంటనే కోదండాపూర్ పిఎస్ పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేయడం జరిగింది . దీనిపైన పోలీస్ అధికారులు విచారణ జరుపుతున్నారు. కాగా ఒక్కోఏద్దు రూ.70,000 విలువ ఉంటుందని బాధితులు తెలిపారు.