ఆన్లైన్ బెట్టింగ్పై కేంద్రం కీలక నిర్ణయం

ఆన్లైన్ బెట్టింగ్ను అరికట్టడానికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్లైన్ బెట్టింగ్ను నేరంగా పరిగణించే ‘ఆన్లైన్ గేమింగ్ బిల్లు'కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ బిల్లును బుధవారం లోక్సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.