అలంపూర్ ఎక్స్ రోడ్లో మొక్కజొన్న కొనుగోలు చేయాలి

Apr 13, 2026 - 19:38
 0  5
అలంపూర్ ఎక్స్ రోడ్లో మొక్కజొన్న కొనుగోలు చేయాలి
అలంపూర్ ఎక్స్ రోడ్లో మొక్కజొన్న కొనుగోలు చేయాలి

తెలంగాణ రైతు సంఘం.
 జోగులాంబ గద్వాల 13 ఏప్రిల్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి : అలంపూరు. ఉండవల్లి మానవపాడు మండలాలలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ అల్లంపూర్ ఎక్స్ రోడ్ లోని మార్కెట్ యార్డ్ లో రైతులతో కలిసి తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు జీకే ఈదన్న, జిల్లా నాయకులు  సింగరాజు మద్దిలేటి లు మార్కెట్ యార్డ్ ని సందర్శించారు ఈ సందర్భంగా రైతులతో కలిసి మాట్లాడుతూ రబి లో బోర్ బావులు కాలువల ద్వారా పెద్ద మొత్తంలో మొక్కజొన్న పంటను రైతులు పండించడం జరిగింది బహిరంగ మార్కెట్లో మొక్కలకు సరైన ధర లేకపోవడంతో దళారులు అందిన కాడికి తక్కువ ధరతో కొనుగోలు చేయడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ప్రభుత్వం కల్పించిన మద్దతు ధర 2400 రూపాయల గిట్టుబాటు ధరను రైతులకు అందించడం ద్వారా కొంతవరకైనా ఉపశమనం కలుగుతుందని అలంపూర్ ఎక్స్ రోడ్లో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తారన్న ఆశతో రైతులు ఇప్పటికే పంటను మార్కెట్కు తరలించారని వడ్డేపల్లి ఐజ మండలాలలో ఏర్పాటు చేశారని ఇక్కడ కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు పంట అమ్ముకునేందుకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు 


ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు సింగరాజు మద్దిలేటి కనికే  శేఖర్ రైతులు రామిరెడ్డి మద్దిలేటి శేఖర్ రెడ్డి నాగార్జున నాగన్న బడేసాబ్ తదితరులు ఉన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333