ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజావాణి – బాధితులకు భరోసా కల్పించిన జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు

Apr 13, 2026 - 19:37
 0  0
  ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజావాణి – బాధితులకు భరోసా కల్పించిన జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు

 *జోగులాంబ గద్వాల 13 ఏప్రిల్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి :  గద్వాల. జిల్లాలో ప్రజల సమస్యలను త్వరితగతిన, పారదర్శకంగా పరిష్కరించాలనే లక్ష్యంతో ప్రతి సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజావాణి  కార్యక్రమం ప్రజలకు ఒక విశ్వాస వేదికగా మారుతోంది. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు, ఐపీఎస్ స్వయంగా పాల్గొని, జిల్లా నలుమూలల నుండి వచ్చిన 10  మంది  ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను వినడం జరిగింది.

ఈ సందర్భంగా ఎస్పీ  ప్రతి ఫిర్యాదును ఎంతో శ్రద్ధగా పరిశీలిస్తూ, బాధితుల సమస్యలను సవివరంగా అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదుదారుల అభ్యర్థనలను వెంటనే పరిగణనలోకి తీసుకుని, సంబంధిత పోలీస్ స్టేషన్ల ఎస్‌.హెచ్‌.ఓలతో  ఫోన్‌లో మాట్లాడి, ప్రతి కేసును నిష్పక్షపాతంగా విచారణ జరిపి, బాధితులకు న్యాయం జరిగేలా తక్షణ చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

“ప్రజల నమ్మకం పోలీస్ శాఖపై నిలబడాలి” అన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని పేర్కొన్న ఎస్పీ , ప్రతి ఫిర్యాదును అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని, ఎటువంటి ఆలస్యం లేకుండా పరిష్కారం దిశగా ముందుకు సాగాలని అధికారులకు సూచించారు. సమస్యల పరిష్కారంలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోదని హెచ్చరించారు.
జిల్లా ప్రజలను ఉద్దేశించి ఎస్పీ  మాట్లాడుతూ, స్థానిక పోలీస్ స్టేషన్లలో సమస్యలు పరిష్కారం కాకపోతే ఎలాంటి భయం లేకుండా, ఎలాంటి మద్యవర్తిత్వం అవసరం లేకుండా నేరుగా జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. 

ఈ రోజు ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుల వివరాలు: భూ వివాదాలు – 03, వ్యక్తిగత గొడవలు – 03,  భర్త హరాస్మెంట్ – 01,  ఇతర సమస్యలు – 03,  ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ప్రజావాణిలో వచ్చిన ప్రతి ఫిర్యాదును వెంటనే ఆన్లైన్‌లో నమోదు చేసి, వాటి పురోగతిని జిల్లా కార్యాలయం నుంచి నిరంతరం మానిటర్ చేస్తున్నామని తెలిపారు. ప్రతి ఫిర్యాదుదారుడికి న్యాయం జరిగేలా కట్టుబడి ఉన్నామని హామీ ఇచ్చారు.  ప్రజావాణి కార్యక్రమంలో స్పందనతో కూడిన చర్యలు తీసుకోవడం పట్ల ఫిర్యాదుదారులు సంతృప్తి వ్యక్తం చేస్తూ, జిల్లా పోలీస్ వ్యవస్థపై విశ్వాసం వ్యక్తం చేశారు.

...

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333