సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్ నందు

Apr 13, 2026 - 19:42
 0  0
సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్ నందు

సిసిటివి కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్ గారు

- నిఘా నేత్రాలతో నేరాలకు అడ్డుకట్ట.
- సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజలు, వ్యాపారులు ముందుకు రావాలి.
- ప్రజల రక్షణలో పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తుంది. 
- నేరాల నివారణలో ప్రజలు  భాగస్వామి కావాలి. 
..... సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్.

సూర్యాపేట పట్టణం పోలీస్ స్టేషన్ నందు 75 సీసీ కెమెరాలు అనుసంధానంతో ఏర్పాటుచేసిన కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ జిల్లా ఎస్పీ నర్సింహా ఐపీఎస్ గారు సూర్యాపేట మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ వైస్ చైర్మన్, మున్సిపల్ కమిషనర్ సూర్యాపేట డిఎస్పి, ఆర్టీవో, సూర్యాపేట పట్టణ ఇన్స్పెక్టర్ లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ నేరాల నివారణ, నేరాల నియంత్రణ, నేరాల చేదనలో సీసీ కెమెరాలు ప్రాధాన్యత చాలా ఉన్నదని సీసీ కెమెరాలు ఏర్పాటుకు ప్రజలు వ్యాపారస్తులు ముందుకు రావాలని నేరాల నివారణలో భాగస్వామ్యం కావాలని కోరారు. అభివృద్ధిలో రోజురోజుకు పురోగతి చెందుతున్న సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రజల భద్రతకు సూర్యాపేట పోలీస్ కట్టుబడి ఉందని నిరంతర అన్నిగా ఉంచి ప్రజలకు పోలీస్ సేవలను చేరువ చేస్తున్నాను తెలిపారు. భద్రతా చర్యల్లో భాగంగా సూర్యాపేట పట్టణంలో 75 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని నిత్యం పర్యవేక్షణ చేయటానికి పట్టణ పోలీస్ స్టేషన్ కు అనుసంధానం చేసి కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ను ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు. సీసీటీవీ కెమెరాల నిఘాలతో నేరాలను అరికట్టవచ్చని తెలిపారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే రక్షణగా నిలుస్తాయని ఒక్కో సిసి కెమెరా 100 నేత్రాలతో వంద మంది పోలీసులతో సమానమని అన్నారు. పట్టణంలో మరింత రక్షణ కల్పించడానికి సీసీ కెమెరాలు ఆధునికరిస్తున్నామని ఎక్కువ మొత్తంలో సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తామని ఈ దిశగా ప్రజలను వ్యాపారము అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు స్థానిక ప్రజలు వ్యాపారులు ముందుకు రావాలని నేరాల నివారణలో భాగస్వామ్యం కావాలని కోరారు. 

కమాండ్ అండ్ కంట్రోల్స్ సెంటర్ ప్రారంభోత్సవం నందు సూర్యాపేట మున్సిపాలిటీ చైర్మన్ నివేదిత లక్షాధి గారు, వైస్ చైర్మన్ షఫీ ఉల్లా గారు, సూర్యాపేట డిఎస్పి ప్రసన్నకుమార్, ఆర్టీవో జయప్రకాశ్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ హనుమంత్ రెడ్డి, సూర్యాపేట పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333