అలంపూర్‌ అభివృద్ధికి అవసరమైన విద్యుత్ సామగ్రి కోసం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కి వినతిపత్రం

అందజేసిన అలంపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ విజయుడు ,

Jul 14, 2026 - 22:42
 0  2
అలంపూర్‌ అభివృద్ధికి అవసరమైన విద్యుత్ సామగ్రి కోసం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కి వినతిపత్రం

 జోగులాంబ గద్వాల 14 జులై 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి.


అలంపూర్.
నియోజకవర్గంలో విద్యుత్ మౌలిక వసతులను బలోపేతం చేసేందుకు అవసరమైన విద్యుత్ స్తంభాలు, కండక్టర్,ఏబీ కేబుల్స్ , డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు (డీటీఆర్‌లు) తదితర సామగ్రిని మంజూరు చేయాలని అలంపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ విజయుడు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కి వినతిపత్రం అందజేశారు.

ఇటీవల ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ మౌలిక వసతులు దెబ్బతిన్నాయని, రైతులు, గ్రామీణ ప్రజలకు నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు అవసరమైన సామగ్రిని అత్యవసరంగా మంజూరు చేయాలని కోరారు. ఈ సందర్భంగా అలంపూర్ నియోజకవర్గానికి అవసరమైన విద్యుత్ సామగ్రి వివరాల జాబితాను కూడా ఉప ముఖ్యమంత్రికి సమర్పించారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333