మేడే పోస్టర్ విడుదల.

Apr 25, 2026 - 18:50
Apr 25, 2026 - 18:54
 0  1
మేడే పోస్టర్ విడుదల.

141వ మేడేను జయప్రదం చేయాలి – కార్మిక హక్కులను కాపాడాలి.

ఎఐటియుసి జిల్లా అధ్యక్షులు బి ఆంజనేయులు.

జోగులాంబ గద్వాల 25 ఏప్రిల్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- మేడే (అంతర్జాతీయ కార్మిక దినోత్సవం) సందర్భంగా కార్మికులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ వేడుకలను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు బి ఆంజనేయులు పిలుపునిచ్చారు. 141వ మేడే పోస్టర్ ను కార్మికులతో కలసి విడుదల చేశారు ఈసందర్భంగా ఆంజనేయులు మాట్లాడుతూ 1886 మే 1న అమెరికాలోని చికాగో నగరంలో కార్మికులు 8 గంటల పని దినం కోసం చేసిన చారిత్రక పోరాటానికి గుర్తుగా మేడేను ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నాం. కార్మికుల హక్కులు, సంక్షేమం, సమాన వేతనం కోసం జరిగిన ఆ పోరాటం ప్రపంచ కార్మిక ఉద్యమానికి మార్గదర్శకంగా నిలిచిందన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త కార్మిక కోడ్లు (Labour Codes) కార్మికుల హక్కులను దెబ్బతీసే విధంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కోడ్ల వల్ల పని గంటలు పెరిగే ప్రమాదం ఉంది,కాంట్రాక్ట్ ఉద్యోగాలు పెరిగి శాశ్వత ఉద్యోగాలు తగ్గే అవకాశం ఉందినీ,ట్రేడ్ యూనియన్ల హక్కులు పరిమితం అవుతున్నాయి,కార్మికులకు లభించే భద్రతా, సంక్షేమ ప్రయోజనాలు తగ్గే పరిస్థితి ఏర్పడుతోంది.ఇవి కార్మిక వర్గాన్ని బలహీనపరిచే చర్యలుగా వారు విమర్శించారు.

ఈ నేపథ్యంలో గద్వాల జిల్లా కేంద్రం లోని సీపీఐ జిల్లా కార్యాలయంలో మేడే పోస్టర్‌ను విడుదల చేశారు. అంతకు ముందు నల్లకుంట హమాలీ కార్మికులతో మేడే పోస్టర్ విడుదల చేసినట్లు తెలిపారు. అలాగే వివిధ సంఘాల అధ్యక్షులు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ, కార్మికుల ఐక్యతతోనే హక్కులను కాపాడుకోవచ్చని, మేడే స్పూర్తిని కొనసాగిస్తూ పెద్ద ఎత్తున కార్యక్రమాల్లో పాల్గొని మేడేను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి ఖాసిం,ఆటో యూనియన్ కార్యదర్శి శాంతన్న, లారీ హమాలీ యూనియన్ కార్యదర్శి నారాయణ, బైక్ రిక్షా నాయకులు వెంకటేశ్, కృష్ణ, వెంకటేశ్, ఏఐటీయూసీ  నాయకులు కార్యకర్తలు బంగారు తిమ్మప్ప, ట్రాన్స్ పోర్ట్ యూనియన్ కార్యదర్శి మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State