అక్రమ అరెస్ట్ లతో ప్రజా పాలనను కొనసాగించలేరు.
బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు మరియు జోగులాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య
జోగులాంబ గద్వాల 14 జులై 2026 తెలంగాణ వార్త ప్రతినిధి:- ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆలంపూర్ నియోజకవర్గానికి వస్తున్న సందర్బంగా..ఇచ్చిన హామీలు అమలు చేయండి అని అడుగుతున్న పాపానికి ఐజ పట్టణంలో ముందస్తుగా అరెస్ట్ చేసి ఐజ పోలీస్ స్టేషన్ కు బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు కురువ పల్లయ్య ను తరలించారు.
ఈ సందర్బంగా బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు కురువ పల్లయ్య మాట్లాడుతూ... అక్రమంగా తుంగభద్ర నది పైన RDS కు పైన 100 మీటర్ల దూరం లో నిర్మిస్తున్న కురిడి ప్రాజెక్టు ను ఆపాలి.
మరియు చిక్కలపర్వి, చిక్కమాంచాల దగ్గర నిర్మిస్తున్న రోడ్ కం బ్యారేజ్ లను ఆపాలి.
అటు ఏపీ ప్రభుత్వం మరియు ఇటు కర్ణాటక ప్రభుత్వం 52 టీఎంసీ లతో నిర్మించ తలపెట్టిన కొప్పల్ జిల్లా నావలి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ను అడ్డుకోవాలి.
తక్షణమే మలమ్మ కుంట జూలకల్లు వల్లూరు రిజర్వాయర్ పనులను ప్రారంభించాలి.
భట్టి విక్రమార్క ఎన్నికలలో ఇచ్చిన హామీ ఐజా మండల కేంద్రానికి డిగ్రీ కళాశాలను తక్షణమే మంజూరు చేయాలి.. అదేవిధంగా బాలికల జూనియర్ కాలేజీ, బి.ఎడ్ కాలేజ్ ను, పాలిటెక్నిక్, ఐటిఐ కాలేజ్ మరియు మండల కేంద్రానికి కాలేజీ వసతగృహాలను మంజూరు చేయాలి.
నియోజకవర్గం లో జూలకల్లు స్టేజి దగ్గర అగ్రికల్చర్ కాలేజీను మంజూరు చేయాలి.
అలంపూర్ నియోజకవర్గంలో విద్యార్థులకు స్కూల్స్ పోవడానికి కాలేజీలకు పోవడానికి రోడ్డు సౌకర్యం సరిగా లేదు రవాణా సౌకర్యం సరిగా లేదు కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. తక్షణమే ఆ సౌకర్యాలు కల్పించాలి.
అదే విధంగా రాష్ట్రంలో ఇంతవరకు బడుగు బలహీన వర్గాలకు విద్యార్థులకు ఫీజు రియింబర్స్ మెంట్ విడుదల చేయలేదు. మీరు ఏదైతే హామీ ఇచ్చినారో సంవత్సరం లోపల రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని అది కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. నిరుద్యోగ భృతి ఇవ్వలేదు మహిళా విద్యార్థులకు స్కూటీలు ఇవ్వలేదు ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వలేదు
ఇవాళ మీరిచ్చిన 6 గ్యారెంటీలు 420 హామీలకు పంగనామాలు పెట్టి హెలికాప్టర్లు లలో ఊరేగుతున్నారు తప్ప ఏ ఒక్క హామీని ఇంప్లిమెంట్ చేయకపోవడం దుర్మార్గం. తక్షణమే హామీలను నెరవేర్చిన తర్వాతనే నియోజకవర్గానికి రావాలని డిమాండ్ చేస్తూ హెచ్చరించారు. ముందస్తు అరెస్ట్ అయిన వారిలో రాజు, స్వామి తదితరులు ఉన్నారు.